Bhoothaddam Bhaskar Narayana: యంగ్ హీరో శివ కందుకూరి ఈసారి యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ తో వస్తున్నాడు. అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేసిన ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమా మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. ఇక సినిమాకు తగ్గట్టే ప్రమోషన్స్ చేయడం అనేది ట్రెండ్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. తాజాగా ఆ ట్రెండ్ ను నారాయణ మేకర్స్ బాగా ఒంటబట్టించుకున్నారని అర్దమవుతుంది.
ఇక ఈ కాలంలో సినిమా ఎలా ఉన్నా .. థియేటర్ కు ప్రేక్షకులకు రప్పించాలంటే మంచి ప్రమోషన్స్ చేయాలి. అందుకే.. భూతద్ధం భాస్కర్ నారాయణ టీమ్ కొత్తగా ఆలోచించి డిఫరెంట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే ట్రైలర్ లో అమ్మాయిలు మిస్సింగ్, తలలు మిస్సింగ్ అని చూపించారు. అలాగే ఒక అమ్మాయి.. తల లేని బొమ్మను రాత్రి పూట జనాలు తిరిగే మధ్య పెట్టి.. ఆత్మగా మారిన అమ్మాయి.. నన్ను ఎవరు చంపారు అనే బోర్డు పట్టుకొని.. భూతద్ధం భాస్కర్ నారాయణ ఎక్కడ అని అందరిని అడగడం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఇక సడెన్ గా రోడ్డు మీద దెయ్యాలను చూసిన ప్రజలు భయపడుతున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ తరువాత ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ ప్రమోషన్స్ సినిమా హిట్ ఇవ్వడానికి ఎంత వరకు ఉపయోగపడ్డాయో చూడాలంటే.. సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.
#BhoothaddamBhaskarNarayana
సినిమా విడుదల తేదీ వరకు
ప్రధాన నగరాల్లో ఒక్కో రోజు ఒక్కో చోట
రాత్రి టైమ్ లో ఇలాంటి ప్రచారం సాగిస్తే
భలేగా వుంటుంది జనాల స్పందన pic.twitter.com/nQl0gAs1V6— devipriya (@sairaaj44) February 26, 2024