Rani Chatterjee: బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ ఏ ముహర్తనా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టాడో అప్పటినుంచి అతడిపై విమర్శలు మొదలయ్యాయి. ఒక ఉమనైజర్ ను పబ్లిక్ చూసే షోలో చూపిస్తున్నారు.. సిగ్గులేదు అంటూ యాజమాన్యంతో మొదలైన తిట్ల దండకం.. అతడు ఏడిపించిన హీరోయిన్ల వద్దకు వచ్చి ఆగింది. సాజిద్ ఖాన్ తమను ఎలా వేధించాడో తెలుపుతూ ఒకరి తరువాత ఒకరు సోషల్ మీడియాలో ఏకరువు పెడుతున్నారు. తాజాగా భోజ్ పురి హాట్ బ్యూటీ రాణి ఛటర్జీ వంతు వచ్చింది. సాజిద్ తనను లైంగికంగా వేధించాడని ఘాటు ఆరోపణలు చేసుకొచ్చింది. రాణి ఛటర్జీ.. సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించిన హిమ్మత్ వాలా చిత్రంలో ‘ఢోకా ఢోకా’ అనే ఐటెం సాంగ్ లో నటించింది. ఆ సాంగ్ చేసేటప్పుడు సాజిద్.. తనను ఇంటికి ఒంటరిగా రమ్మని పిలిచాడని చెప్పుకొచ్చింది.. అంతేకాకుండా తనతో మిస్ బిహేవ్ కూడా చేశాడని చెప్పుకొచ్చింది.
“సాజిద్.. ఆ సాంగ్ షూట్ చేసే సమయంలో ఎంతో ఇబ్బంది పెట్టాడు. మొదట తను నా రొమ్ముల సైజ్ ఎంత అని అడిగాడు.. ఆ తరువాత వాటిని తాకడానికి ప్రయత్నించాడు. ఇవే కాకుండా.. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా..? ఉంటే మీరిద్దరూ శృంగారంలో ఎలా ఎంజాయ్ చేశారు అని అడిగాడు.. అది నాకు చాలా అసహ్యంగా అనిపించి.. వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చేశా.. సాంగ్ పూర్తయ్యే వరకు కూడా అతను నా ప్రైవేట్ భాగాలను తాకాలనే ప్రయత్నించేవాడు”అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి.