“భీమ్లా నాయక్” ఈ నెల 25నే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మేకర్స్ పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు. అయితే ఒకవైపు సినిమా విడుదలకు సిద్ధం అవుతుంటే మరోవైపు “భీమ్లా నాయక్”కు సంబంధించిన పలు రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి ఓ రూమర్ కు దర్శకుడు సాగర్ తాజాగా దిగిన ఓ పిక్ తో ఫుల్ స్టాప్ పెట్టేశారు.
Read Also : Raja Deluxe : ప్రభాస్ తో ‘మాస్టర్’ బ్యూటీ రొమాన్స్
అసలు దర్శకుడు సాగర్ చంద్రను పక్కన పెట్టి “భీమ్లా నాయక్” ప్రాజెక్ట్‌ను దర్శకుడు త్రివిక్రమ్ పూర్తిగా టేకోవర్ చేశాడని సెట్స్ బయట టాక్ నడుస్తోంది. అయితే దర్శకుడు సాగర్ చంద్ర కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో సినిమా చివరి షాట్ పూర్తయిందని పోస్ట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్న పిక్ ను పోస్ట్ చేశాడు. నిజానికి త్రివిక్రమ్ సినిమా మ్యూజిక్ సెషన్స్, ఇతర ముఖ్యమైన పోస్ట్-ప్రొడక్షన్ ప్రాంతాలలో కనిపించడంతో సాగర్ పక్కన పెట్టారని చాలా మంది భావించారు. కానీ త్రివిక్రమ్ గైడెన్స్ లో సినిమా దర్శకత్వ బాధ్యతలు మాత్రం సాగర్ చేపట్టినట్టుగా తెలుస్తోంది.
ఒక స్టార్ డైరెక్టర్‌గా, సినిమాను తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా ఏ విధంగా రీమేక్ చేయాలో తెలిసిన వ్యక్తిగా త్రివిక్రమ్ కు బాగా తెలుసు. అయితే ఈ ప్రాజెక్ట్ లో ఆయనకు ఇస్తున్న క్రెడిబిలిటీ కారణంగా ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనేది కాదనలేని వాస్తవం. ఎందుకంటే త్రివిక్రమ్ తొలి హిట్స్ లో ఒకటైన “నువ్వే కావాలి” కూడా రీమేక్ అన్న విషయం తెలిసిందే. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సినిమాలను తీర్చిదిద్దడంలో ఆయనకు ఆయనే సాటి త్రివిక్రమ్.