Bhala Thandana Trailer: ఆశ డబ్బు కంటే స్ట్రాంగ్ ఎమోషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్న టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు. ఇటీవలే ‘అర్జున ఫల్గుణ’ చిత్రంతో పరాజయాన్ని అందుకున్న ఈ హీరో తాజాగా `భళాతందనాన` అనే చిత్రంతో ప్రేక్షకుల ముద్నుకు వస్తున్నాడు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తుండగా.. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణు సరసన క్యాథరిన్ థెరిస్సా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్ తో ఆసక్తి రేపిన మేకర్స్ తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేపుతోంది. ” శశి రేఖ అనే ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్.. ఎన్నో క్రైమ్ స్టోరీలను కవర్ చేస్తూ ఎప్పుడూ ప్రమాదమైన కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక ఆమెకు తోడుగా హీరో కనిపించాడు. కానీ ఒక హవాలా కేసులో హీరోనే సస్పెక్ట్ గా చూపించారు.
2000 కోట్ల డబ్బు చుట్టూ హీరో పడుతున్నట్లు, మరోపక్క ఆ కేసును సాల్వ్ చేసే దిశగా హీరోయిన్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు చూపించారు. ఇక చివర్లో ఆశ డబ్బు కంటే చాలాస్ట్రాంగ్ ఎమోషన్ అని శ్రీ విష్ణు చెప్పిన డైలాగ్ తో కథమొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుందని చెప్పేశారు. మరి చివరకు 2000 కోట్ల డబ్బు ఎవరికి దక్కింది, హీరో నేరాన్ని హీరోయిన్ ఋజువు చేసిందా..? అస్సలు ఆ డబ్బంతా ఎవరిది..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. క్రైమ్..మనీ..ఎమోషన్ చుట్టూ తిరిగే కథగా డైరెక్టర్ ట్రైలర్ కట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకు మణిశర్మ బీజీఎమ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మొత్తానికి ట్రైలర్ తోనే ఆసక్తిని పెంచేశారు మేకర్స్. మరి మే 6 న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకోనున్నదో చూడాలి.
Also Read
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!