Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత తెలుగు చిత్రసీమలో యాక్షన్ పేరుతో వెండితెరకు రక్తాభిషేకం చేయడం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. ఒకప్పుడు కథ, కథనాలు, బలమైన భావోద్వేగాలు కమర్షియల్ విజయాన్ని నిర్ణయించేవి. కానీ ఇప్పుడు తెరపై కత్తులతో ఊచకోత కోస్తేనే, నరనరాన భయం పుట్టించేలా రక్తపాతం సృష్టిస్తేనే సినిమా హిట్ అవుతుందనే భావన పెరిగిపోతోంది. హింసను అతిగా చూపించడమే కమర్షియలిజం అనే రేంజ్లో మేకర్స్ రక్తాన్ని పారించడం కలవరపెడుతోంది.
ఇటీవల వచ్చిన అనేక భారీ చిత్రాలలో ఓవర్ యాక్షన్, కత్తి పడితే తలలు తెగిపడటం సాధారణ విషయంగా మారిపోయాయి. ‘ది ప్యారడైజ్’ లాంటి సినిమాల్లో కత్తి పడితే తలలు తెగిపడేంతగా నరమేధాన్ని చూపించారు. ఇక ‘టాక్సిక్’ హింసకు పరాకాష్టగా చూపించారు. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ కమర్షియల్‌గా ఓకే అనిపించుకున్నప్పటికీ అందులోనూ వైలెన్స్ హద్దులు దాటిందనే వ్యాఖ్యలు వినిపించాయి. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ క్లైమాక్స్ సీన్ పై వచ్చిన తీవ్ర విమర్శలు, విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’ టీజర్ నిండా రక్తం నింపేయడం ఈ పరిస్థితికి నిదర్శనాలు. ఈ స్థాయి ఓవర్ యాక్షన్, విపరీతమైన రక్తం చిందించే సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నాయి. కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి హాయిగా సినిమా చూసే వాతావరణం మాయమవుతోంది. కేవలం బి-సి సెంటర్ల మాస్ క్రేజ్, కలెక్షన్ల కోసమే మేకర్స్ ఈ విధమైన హింసను ఆశ్రయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కత్తీ-రక్తం మాత్రమే సినిమాను గట్టెక్కిస్తాయా? లేక కంటెంట్ లేని వైలెన్స్ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది తప్ప ఎప్పటికి మెప్పించదు. ఈ విషయం మేకర్స్ కు ఎప్పడు తెలుస్తుందో.
Also Read
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
- Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
- SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. 'వారణాసి' ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
- Love And War : 'లవ్ అండ్ వార్'ను విడిచిపెట్టని లీక్స్
తాజావార్తలు
-
Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
-
Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ ‘బాహుబలి’ వీడియో షేర్ చేసి..!
-
Supreme Court: “ఒక్క సెప్టెంబర్‌లోనే 13 అత్యాచారాలు”.. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!