Bhagavanth Kesari: భగవంత్ కేసరికి ఫేక్ కలెక్షన్స్.. అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil ravipudi Comments on Bhagavanth Kesari collections : భగవంత్ కేసరి కలెక్షన్స్ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ లభించింది. బాలయ్య కొత్త సినిమామీ షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. ఇక సినిమా టీం రోజు బాక్సాఫీస్ కలెక్షన్లను అధికారికంగా విడుదల చేస్తూనే ఉన్నాయి. అయితే కలెక్షన్లు పెంచి అనౌన్స్ చేస్తున్నారు అని సోషల్ మీడియాలో కొంత మంది ప్రచారం చేస్తుండగా దానికి కౌంటర్ ఇస్తూ అనిల్ రావిపూడి సమాధానం ఇచ్చారు. భగవంత్ కేసరి టీమ్ అధికారికంగా విడుదల చేసిన కలెక్షన్స్ ఏమాత్రం ఫేక్ కాదని, జెన్యూన్ నంబర్స్ పోస్ట్ చేస్తున్నాయని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అన్నారు.
Dil Raju: దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..
Also Read
- Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
- OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
- Renu Desai: 'ఓం' ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
- Janta Movie: మెగా హీరో 'జంట' సెన్సేషనల్ క్యాప్షన్ వెనుక అసలు కథ ఇదే!!
సక్సెస్ టూర్లో భాగంగా, ఎఫ్ 2 దర్శకుడు ఈ రోజు చాలా థియేటర్లను సందర్శించాడు. ఈ క్రమ్మలో మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా, కలెక్షన్ల గురించి మాట్లాడాడు. కొంతమంది నిర్మాతల నుండి అధికారిక గణాంకాల కంటే తక్కువ నంబర్లను పోస్ట్ చేస్తే, తాను వాటి గురించి బాధపడనని చెప్పాడు. భగవంత్ కేసరి బాక్సాఫీస్ నంబర్లు ఫేక్ అని ప్రొడ్యూసర్స్ పెంచి రిలీజ్ చేస్తున్నారు అని కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. ఇది బ్లాక్ బస్టర్ అని నిరూపించడానికి దర్శకుడు పోస్టర్లో అసలు వాటి కంటే ఎక్కువ కలెక్షన్స్ వేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, అనిల్ రావిపూడి అన్ని పుకార్లను త్రోసిపుచ్చారు. ఈ సినిమా కలెక్షన్లు నిజమైనవని, ఏమాత్రం పెంచలేదని ఆయన అన్నారు. ఇక మరోపక్క భగవంత్ కేసరి యూనిట్ సక్సెస్ యాత్రను ప్రారంభించింది, ఈ రోజు వైజాగ్, రాజమండ్రి, ఏలూరు లోని థియేటర్లను సందర్శించింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026: కన్నుల పండుగగా కోటి దీపోత్సవం.. నాలుగో రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఇవే..
-
Edible Oil Imports Surge: వంట నూనెల దిగుమతుల కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు.. 24 శాతం పెరిగిన బిల్లు!
-
IPL 2027-SRH: నకిలీ బౌలింగ్‌తో ఇన్నాళ్లు కొనసాగాడు.. తుది జట్టులోకి ఎలా వస్తాడో అర్థం కావడం లేదు!
-
Yamaha Xenter E: 108KM రేంజ్‌తో యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 7.5kW మోటార్, ఫీచర్లు ఇవే!
-
ONGC Gas Leak: కోనసీమలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!