Bellemkonda Srinivas: రాజమౌళి-ప్రభాస్ కలయికలో రిలీజ్ అయి భారీ విజయం సాధించిన సినిమా ‘ఛత్రపతి’. ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేకే చేసే సాహసానికి పూనుకున్నాడు బెల్లంకొండవారబ్బాయి సాయి శ్రీనివాస్. 2014లో ‘అల్లుడు శ్రీను’తో కెరీర్ మొదలు పెట్టిన బెల్లంవారబ్బాయి ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడకున్నా మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్నాడు. 2019లో ‘రాక్షసుడు’తో హిట్ కొట్టినా ఆ తర్వాత వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ నిరాశపర్చటంతో కొద్దిగా స్పీడ్ తగ్గించాడు సాయిశ్రీనివాస్. అయితే అనూహ్యంగా ‘ఛత్రపతి’ ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తూ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇక ఈ సినిమాకు తనని హీరోగా పరిచయం చేసిన వివివినాయక్ దర్శకుడు కావటంతో అంచనాలు పెరిగాయి. ఏమైందో ఏమో కానీ ఈ సినిమా పూర్తయి రిలీజ్ కావటానికి బాగా టైమ్ తీసుకుంది. అందుకు కారణం విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం కావటంతో పాటు హిందీ టైటిల్ వారి వద్ద లేకపోవడమే అని వినిపించింది.
NTR30: ఎన్టీఆర్ 30 షూటింగ్ అప్డేట్..
ఇక దీంతో మేకర్స్ థియేటర్లలోనే విడుదల చేస్తామని మొత్తుకుంటున్నా… థియేటర్ లో రాదు… ఓటిటిలో రిలీజ్ అంటూ సోషల్ మీడియాలో పలు పుకార్లు షికారు చేశాయి. ఇప్పుడు వాటన్నింటికి పుల్ స్టాప్ పెడుతూ రిలీజ్ కి రెడీ అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం హిందీకి ‘ఛత్రపతి’ టైటిల్ నే సాధించింది యూనిట్. ఇదొక విజయం అయితే రిలీజ్ కూడా మే 5న చేయబోతున్నారన్నది మరో న్యూస్. సో ప్రభాస్ చేసి మెప్పించిన సినిమాతో సాయిశ్రీనివాస్ బాలీవుడ్ ఆడియన్స్ ను మెప్పించాల్సి ఉంది. మేకర్స్ ఈ విషయంలో పూర్తి నమ్మకంతో ఉన్నారు. హిందీ డబ్బింగ్ సినిమాల ద్వారా ఇప్పటికే ఉత్తరాది ఆడియన్స్ ను మెప్పించిన సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’గా వారి మదిని గెలుస్తాడో లేదో తెలియాలంటే మే 5 వరకూ ఆగాల్సిందే! సో లెట్స్ వెయిట్ అండ్ సీ.