ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరొక భాషలో రీమేక్ చేయడం ఈ రోజుల్లో వెరీ కామన్. కానీ చేసే ప్రతి సినిమా రీమేక్ అంటే మాత్రం ట్రోల్ల్స్ తప్పవు. ఇప్పుడు అలంటి ట్రోల్స్ కు గురువుతున్నాడు టాలీవుడ్ కాస్ట్లీ స్టార్ బెల్లంకొండ శ్రీనివాస్. అల్లుడు శ్రీను తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బెల్లం బాబు స్ట్రయిట్ సినిమాల కంటే రీమేక్ సినిమాలతోనే హిట్స్ అందుకున్నాడు. శ్రీనివాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే రాక్షసుడు అనే చెప్పాలి. ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ రాక్షసన్ కు రీమేక్.
Also Read : Tollywood : సెకండాఫ్ సమరానికి స్టార్స్ రెడీ.. బోణి కొట్టబోతున్న పవర్ స్టార్
స్ట్రయిట్ సినిమాలతో వరుస ఫ్లోప్స్ రావడంతో రీమేక్స్ ను నమ్ముకున్నాడు బెల్లం. రీసెంట్ గా మరోక తమిళ సూపర్ హిట్ గరుడన్ ను భైరవం పెరుతో రీమేక్ చేశాడు. భారీ బడ్జెట్ పై నిర్మించిన ఈ సినిమా యావరేజ్ గా మిగిలింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ బెల్లంకొండ మరో రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. హిందీలో కిల్ అనే సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సషనల్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమాను రమేష్ వర్మ డైరెక్షన్ లో రీమేక్ చేయబోతున్నాడట. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ రీమక్స్ తో భారీ ప్లాపులు చూసాడు బెల్లంకొండ. ఛత్రపతి సినిమను అదే పేరుతో హిందీలో రీమేక్ చేస్తే డిజాస్టర్ అయింది. భైరవం కూడా ప్లాప్. ఇప్పుడు మల్లి రీమేక్. ఇలా రీమేక్స్ ను నమ్ముకునే బదులు తన స్ట్రెంత్ ఏంటో ఆడియెన్స్ తనను ఎలా చూస్తారో అని విశ్లేషించుకుని స్ట్రయిట్ సినిమాలు చేయచ్చుకదా రీమేక్ స్టార్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.