Bandla Ganesh Diwali Crackers Photo goes viral in social media: కమెడియన్ గా నటుడిగా సత్తా చాటి నిర్మాతగా మారిన బండ్ల గణేష్ ఇప్పుడు మాత్రం అవన్నీ ఆపేసి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఒకపక్క చంద్రబాబుకు మద్దతు పలుకుతూనే మరో పక్క కాంగ్రెస్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న బండ్ల గణేష్ తాజాగా తన సోషల్ మీడియా ద్వారా నాలుగు ఫోటోలను షేర్ చేశారు. నిజానికి గత నాలుగైదు ఏళ్ల నుంచి బండ్ల గణేష్ దీపావళి సందర్భంగా టపాసులు కొనుగోలు చేసి సాయంత్రం కాల్చబోతున్న టపాసులు అన్నింటితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అలా బండ్ల గణేష్ షేర్ చేయగానే దీపావళి కళ వచ్చేసింది అంటూ ఆయన అభిమానులు కూడా కామెంట్లు పెడుతూ ఉంటారు. తాజాగా బండ్ల గణేష్ తన తండ్రి, ఇద్దరు కుమారులతో కలిసి టపాసులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దాదాపుగా ఈ టపాసుల ఖరీదు ఏ పది పదిహేను లక్షల్లో ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే అక్కడ కనిపించే వాడిని అలాంటి ఖరీదైన టపాసులు కనిపిస్తున్నాయి.
Himaja Arrest: నేను అరెస్టు కాలేదు.. పోలీసులు అందుకే వచ్చారు- వీడియో రిలీజ్ చేసిన హిమజ
ఇక ఈ ఫోటోలలో బండ్ల గణేష్ అయ్యప్ప మాల ధరించి కనిపిస్తుండగా ఆయన ఇద్దరు కుమారులు సైతం అయ్యప్ప మాల ధరించే కనిపిస్తున్నారు. తాను ఈ మధ్యకాలంలో దసరా, వినాయక చవితి సరిగా చేసుకోలేదు కానీ దీపావళి మాత్రం బ్రహ్మాండంగా చేసుకుంటున్నానంటూ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఈ మేరకు కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి కచ్చితంగా గెలుస్తుందని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు, 2018 ఎన్నికల్లో సైతం ఆయన ఇదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. అయితే ఆ తర్వాత కాస్త రాజకీయాలకు దూరంగా వ్యవహరిస్తూ వస్తున్నా ఎన్నికల దగ్గరగా పడుతున్న కొద్ది బండ్ల గణేష్ కూడా కాంగ్రెస్కు మద్దతుగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఉండడం గమనార్హం.
దీపావళి శుభాకాంక్షలు 🙏🙏🙏🙏 pic.twitter.com/x7MZB8CrTD
— BANDLA GANESH. (@ganeshbandla) November 12, 2023