Himaja Arrest: నేను అరెస్టు కాలేదు.. పోలీసులు అందుకే వచ్చారు- వీడియో రిలీజ్ చేసిన హిమజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss Himaja Clarity on her rave party arrest: నటి బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఇంట్లో రేవ్ పార్టీని హైదరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు భాగం చేసినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 11 మంది సెలబ్రిటీలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు కూడా నమోదు చేశారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హిమజ తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసింది. ఈ వార్తలన్నీ అవాస్తవం అని చెబుతూ తాను తన నివాసంలో దీపావళికి హౌస్ పార్టీ ప్లాన్ చేసుకుని తనకు కావాల్సిన వాళ్ళందర్నీ పిలుచుకున్నానని చెప్పుకొచ్చింది. తాను కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి దీపావళి కావడంతో బంధువులను మిత్రులను పిలిచి ఒక మంచి పార్టీ చేసుకున్న సమయంలో ఎవరో తెలియని వారు పోలీసులకు సమాచారం ఇచ్చారని పోలీసులు వచ్చి ఏం జరుగుతోందని ప్రశ్నించి ఏమైనా చట్ట విరుద్ధంగా జరుగుతుందా లేదా అని చెక్ చేసి వెళ్లారని హేమజ చెప్పుకొచ్చింది. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారని ఎలక్షన్స్ టైం కాబట్టి ఏమైనా తప్పుగా జరుగుతుందేమో అనే ఉద్దేశంతో వచ్చి చెక్ చేశారు కానీ ఎలాంటి చట్ట విరుద్ధమైన పనులు జరగడం లేదని తెలుసుకుని వెళ్లిపోయారని హిమజ చెప్పుకొచ్చింది.
Himaja Arrest: బిగ్ బాస్ ఫేమ్ హిమజ సహా 11 మంది అరెస్ట్?
Also Read
మేము వాళ్ళకి చాలా కార్పొరేట్ చేశామని, వాళ్లు కూడా చాలా మర్యాదగా నడుచుకున్నారని అని చెప్పుకొచ్చింది. అయితే మీడియాలో రేవ్ పార్టీ భగ్నం చేసి తనను అరస్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోందని, అది ఎంత మాత్రం నిజం కాదని ఆమె చెప్పుకొచ్చింది. వ్యూస్ కోసం ఇలా రాయడం కరెక్ట్ కాదని, నిజం ఏమిటో తెలుసుకుని ఆ తర్వాత ఇలాంటి వార్తలు పబ్లిష్ చేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చింది. ఈ వార్తలు, న్యూస్ యాప్ లోని వార్తలు చూసి చాలా మంది భయపడి తనకి కాల్స్ చేస్తున్నారని వారందరికీ సమాధానం చెప్పలేక ఇలా ఒక వీడియో చేసి పెడితే అందరికీ ఒక క్లారిటీ ఇచ్చినట్లు అవుతుంది అని వీడియో చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. రేవు పార్టీ అంటున్నారు రేవ్ పార్టీ నిర్వహిస్తూ గనక పోలీసులు చెక్ చేస్తే ఇలా నేను లైవ్ వీడియో పెట్టగలనా అని ఆమె ప్రశ్నించారు. మేమందరం మా ఇళ్ళల్లో హ్యాపీగా ఉన్నాం, కాసేపట్లో దీపావళి పూజ కూడా ప్రారంభించుకోబోతున్నాం అయినా ఎందుకు ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె చెప్పుకొచ్చింది. పోలీసులు వచ్చారు, చెక్ చేసుకున్నారు, వెళ్లిపోయారు, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. మరి ఈ సమాచారం పోలీసులకు ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చారో? నాకు తెలియదు కానీ అది రకరకాలుగా మీడియా వరకు వెళ్లిందని ఆమె చెప్పుకొచ్చారు. అసలు ఏం జరిగిందో తన వాళ్ళందరికీ తెలుసుగాని తన శ్రేయోభిలాషులకు మాత్రం ఈ విషయంలో కాస్త క్లారిటీ ఇవ్వాలనిపించి వీడియో చేస్తున్నానని తాను పోలీస్ స్టేషన్లో లేను ఇంటిలోనే ఉన్నానని చెబుతూ వీడియోలో కూడా ఇంటిని చూపించే ప్రయత్నం చేసింది.
తాజావార్తలు
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!