NBK 107: అఖండ సినిమా తరువాత బాలయ్య రేంజ్ పాన్ ఇండియా వరకు దూసుకువెళ్లింది. ఈ సినిమా రికార్డుల మోత మోగించి నందమూరి బాలకృష్ణ స్టామినాను తెలియజేసింది. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 చేస్తున్న విషయం విదితమే.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన బాలయ్య పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
కాగా, గత కొద్దిరోజుల నుంచి ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్న విషయం విదితమే. రెడ్డి గారు, జై బాలయ్య, అన్నగారు.. ఇలా పలురకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో మేకర్స్ ఏది ఫైనల్ చేసారో తెలుసుకోవాలంటే కొండారెడ్డి బురుజు దగ్గరకు రావాల్సిందే అని అంటున్నారు చిత్ర బృందం. అవును మరీ.. ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ ను కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు దగ్గర నిర్వహిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. అక్టోబర్ 21 న ఈ వేడుక జరగనుంది. ఇక కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య తొడకొడితే.. అభిమానుల రచ్చ మాములుగా ఉండదు అంటున్నారు. ఒక మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్ ను ఇంత గ్రాండ్ గా నిర్వహించడం ఇదే మొదటిసారి అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. మరి ఈ సినిమా టైటిల్ ఎలా ఉండబోతుందో చూడాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.