Nandamuri Balakrishna:ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం విదితమే.. హీరోల పుట్టినరోజున వారి హిట్ సినిమాలను 4k సౌండ్ తో థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పోకిరి, జల్సా సినిమాలు థియేటర్లో రీ రిలీజ్ అయ్యి రచ్చ రచ్చ చేశాయి. ఇక తాజాగా ఈ లిస్ట్ లోకి నందమూరి నటసింహం చేరాడు. బాలకృష్ణ హిట్ సినిమాల్లో ఒకటైన చెన్నకేశవరెడ్డి సెప్టెంబర్ 25 న రీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా 2002, సెప్టెంబర్ 25 న రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని అందుకొంది.
ఇక ఈ సినిమా ఈ ఏడాదితో 20 ఏళ్ళు పూర్తి చేసుకోనున్న సందర్భంగా 24, 25 తేదీల్లో భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్ లో కూడా రీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.. అమెరికాలో కూడా బాలయ్య క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. అందుకే అక్కడ కూడా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన టబు, శ్రీయ నటించారు. చెన్నకేశవరెడ్డి సినిమాలో ప్రతి డైలాగ్ అరుపులు.. కేకలు పుట్టిస్తుందంటే అతి శయోక్తి కాదు. ముఖ్యంగా బాలకృష్ణ.. సత్తి రెడ్డి అని అరిచినప్పుడు.. భూమిలో నుంచి కార్లు బయటికి వచ్చే సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక ఈ సినిమా రీ రిలీజ్ అంటే ఫ్యాన్స్ కు పూనకాలే అని చెప్పవచ్చు. పోకిరి, జల్సా సినిమాలకే అభిమానులు థియేటర్లలో కుర్చీలు విరకొట్టేశారు. ఇక బాలయ్య సినిమా అంటే అంతకు మించి ఉంటుంది అని తెలుస్తోంది. మరి ఈసారి థియేటర్ యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటుందో చూడాలి.