Balayya: అందుకేగా అందరూ జై బాలయ్య అనేది.. అభిమాని కోసం ఏం చేశాడో చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna Photo with Disabled fan goes Viral in Social Media: నందమూరి వారసుడు బాలకృష్ణ ఒకపక్క సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరోపక్క రాజకీయం కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆయన అభిమానులతో కాస్త దురుసుగా ప్రవర్తిస్తాడని భావిస్తూ ఉంటారు. దానికి కారణం ఆయన అభిమానుల మీద చేయి చేసుకున్న వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ కావడమే. అయితే ఆయనను సన్నిహితంగా చూసిన వారు మాత్రం అలాంటిదేమీ లేదని ఆయన చాలా మంచి వాడని, చిన్నపిల్లాడి మనసు కలవాడని చెబుతూ ఉంటారు. అయితే నందమూరి బాలకృష్ణ తాజాగా చేసిన ఒక పని మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతానికి ఆయన తన నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను కలిసేందుకు ఆయన అభిమాని ఒకరు కార్యాలయానికి వచ్చారు.
MM keeravaani Interview: ‘ఆస్కార్’తో కొంచెం కూడా ఉపయోగం లేదు: కీరవాణి ఇంటర్వ్యూ
Also Read
అయితే ఆ అభిమాని దివ్యాంగుడు కావడంతో లేచి బాలకృష్ణతో మాట్లాడి ఫోటో దిగలేని పరిస్థితి ఏర్పడింది. వెంటనే విషయం అర్థం చేసుకున్నా నందమూరి బాలకృష్ణ తానే మోకాళ్ళ మీద కూర్చుని అభిమానితో ఫోటోలకి ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, ఒక మాజీ ముఖ్యమంత్రికి వియ్యంకుడు తాను స్వయంగా ఎమ్మెల్యే అయినా సరే ఏమాత్రం భేషజాలకు పోకుండా తనను అభిమానించే వారి కోసం ఇలా నేల మీద కూర్చున్నాడు అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరో గురించి గొప్పగా కామెంట్ చేస్తున్నారు. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే చివరిగా వీరసింహారెడ్డి అనే సినిమాతో ఆయన ప్రేక్షకులను పలకరించారు. ఆ తర్వాత భగవాన్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చి మరో హిట్టు కూడా అందుకున్నాడు. ఇక ప్రస్తుతానికి ఆయన బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?