ప్రస్తుతం సోషల్ మీడియాలో బాహుబలి ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. సలార్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంటే ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన బాహుబలి సినిమా ట్యాగ్ ట్రెండ్ అవ్వడం రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇస్తుంది. బాహుబలి 2 ది కంక్లూజన్ సినిమాలో… బాహుబలి క్యారెక్టర్ ని కట్టప్ప పొడిచిన తర్వాత తుది శ్వాస వదులుతూ కూడా తన కత్తిని పట్టుకోని ప్రభాస్ రాజసం చూపిస్తాడు. ప్రాణం పోతున్నా కత్తిని తిప్పి, దానిపైన చెయ్ పెట్టి సింహాసనం పైన కూర్చున్న కింగ్ లా కనిపిస్తాడు ప్రభాస్. ఈ ఒక్క షాట్ ఒకెత్తు బాహుబలి పార్ట్ 1 అండ్ 2 సినిమాలోని సీన్స్ అన్నీ ఒకెత్తు అనేలా ఉంటుంది. ఈ సీన్ ని డిజైన్ చేసిన రాజమౌళి, మ్యూజిక్ కొట్టిన కీరవాణి, ఫ్రేమ్ పెట్టిన సెంథిల్, ప్రభాస్ ఎదురుగా ఉన్న సత్యరాజ్ కూడా ఆడియన్స్ లా మారిపోయి ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కి మెస్మరైజ్ అయ్యి ఉంటారు. ఇప్పుడు ఇదే సీన్ ని రిపీట్ చేసింది సలార్ సినిమా.
ప్రశాంత్ నీల్ ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ కటౌట్ అయిన ప్రభాస్ ని సలార్ గా చూపించి రికార్డుల బూజు దులుపుతున్నాడు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఎండ్ లో ప్రభాస్ ఒరిజినల్ ఐడెంటిటీని రివీల్ చేస్తూ… పార్ట్ 2 “శౌర్యాంగ పర్వం” సినిమాకి లీడ్ ఇస్తూ ప్రశాంత్ నీల్ వేసిన కట్ ని థియేటర్స్ లో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ప్రభాస్ తో చొక్కా విడిపించి, రాక్ సాలిడ్ ఫిజిక్ ని చూపిస్తూ ప్రభాస్ చేతికి కత్తి ఇచ్చాడు ప్రశాంత్ నీల్ అంతే బాహుబలితో కత్తి తిప్పడం అలవాటైన ప్రభాస్… కత్తి పిడి పట్టుకోని తిప్పుతుంటే ఫ్యాన్స్ థియేటర్స్ టాప్ లేచిపోయేలా అరిచారు. ఈ కట్ షాట్స్ లోనే సరిగ్గా బాహుబలిని గుర్తు చేసేలా సలార్ షాట్ పడుతుంది. ఈ కారణంగానే బాహుబలిలోని సీన్ ని సలార్ లోని ఎండ్ సీన్ కి లింక్ చేసి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.