Baby Trailer: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై SKN ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఓ రెండు హృదయాలు ఇలా అనే సాంగ్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నేడు ఈ సినిమా నిర్మాత SKN పుట్టినరోజు సందర్భంగా బేబీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం కాలంలో ప్రేమ ఎలా ఉంది.. ? యువత ప్రేమలో ఎలా ఉంటున్నారు.. ? అనేది సాయి రాజేష్ చూపించాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకొంటుందని ట్రైలర్ ను బట్టి చెప్పొచ్చు. ఒక ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
Nayakudu Trailer: నాయకుడు ట్రైలర్.. వడివేలు నట విశ్వరూపం
మొదటి ప్రేమకు మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది అన్న లైన్ తో ట్రైలర్ ను మొదలుపెట్టాడు. ఆనంద్ మొదటి ప్రేమను మర్చిపోలేక పిచ్చివాడిగా మారినట్లు చూపించారు. ఆనంద్, వైష్ణవి .. స్కూల్ లో ప్రేమించుకుంటారు. వైష్ణవి స్కూల్ లో ఏమి తెలియని అమాయకమైన అమ్మాయిగా ఉంటుంది. ఇక వీరిద్దరూ పదో తరగతి వరకు కలిసి చదువుకుంటారు. ఇక పదో తరగతి ఫెయిల్ కావడంతో ఆనంద్ ఆటో డ్రైవర్ గా మారతాడు. వైష్ణవి పై చదువులు చదువుకోవడానికి సిటీకి వస్తుంది. అక్కడ కాలేజ్ లో ఆమెకు విరాజ్ పరిచయమవుతారు. కొన్నిరోజులకే వైష్ణవికి సిటీ లైఫ్ అలవాటు అవుతుంది. దీంతో ఆనంద్ కు వైష్ణవికి మధ్య గొడవలు మొదలవుతాయి. ఇంకోపక్క వైష్ణవిని విరాజ్ ప్రేమిస్తున్నట్లు చెప్తాడు. ఈ ఇద్దరి మధ్య వైష్ణవి ఎలా నలిగిపోయింది..? చివరికి వారి ఇద్దరిలో ఎవరికి సొంతమయ్యింది.. ? మొదటి ప్రేమను మర్చిపోలేక ఆనంద్ పిచ్చివాడిగా అయ్యాడా ..? లేక వైష్ణవి మోసం చేసిందా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ట్రైలర్ మొత్తంలో చాలా డైలాగ్స్ యువతను ఆకట్టుకొనేలా ఉన్నాయి. ” ఒక్కసారి బడి దాటాకా .. మన ఫిగర్స్ మనవి కావురా.. కాలేజ్ జాయిన్ అయ్యారా .. అంతే సర్వ నాశనం “, ” అందరు అమ్మాయిలు వేరు.. నేను వేరు”, అబ్బాయిలను గుండెల మీద కొట్టాలంటే.. అమ్మాయిల కంటే గట్టిగా ఎవ్వరు కొట్టలేరు అన్న డైలాగ్ అయితే ట్రైలర్ కే హైలైట్ గా మారింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.