Baby Movie to Stream On Aha: చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బేబీ సినిమా గురించి ఇంకా ఎక్కడో ఒక చోట చర్చ జరుగుతూనే ఉంది. కొబ్బరిమట్ట, హృదయ కాలేయం సినిమాల దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా బేబీ తెరకెక్కింది. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించగా ఈ సినిమా దాదాపు 90 కోట్ల దాకా వసూళ్లు రాబట్టుకుంది. ఇక ఇతర సినిమాల ఎంట్రీతో వసూళ్ళలో బ్రేక్ పడడంతో ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఇక ఎట్టకేలకు ‘బేబీ’ సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. ‘బేబీ’ మూవీ తమ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ‘ఆహా’ సోషల్ మీడియాలో ప్రకటించింది.
Prem Kumar: పీటల మీద పెళ్లాగిపోతే, మగాడు పడే కష్టమే.. ‘ప్రేమ్ కుమార్’
రేపు ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపింది. నిజానికి రేపటి నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగినా ఇప్పుడు ఆహా ప్రకటనతో ఈ సినిమా వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 25న రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా రెండు గంటల 55 నిమిషాల వరకు నిడివి ఉండగా మరొక వర్షన్ థియేటర్లలో రిలీజ్ చేశారు కూడా. ఈ సినిమా నాలుగు గంటల కట్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు. ఇక ఈ వెర్షన్లో ఒక ఎక్స్ట్రా సాంగ్ తో పాటు కొన్ని వినసొంపైన ట్రాక్స్ కూడా ఉన్నాయని, ఆనంద్ చేత డ్యాన్స్ చేయించిన సాంగ్ అదిరిపోయిందని అంటున్నారు. ఇక మొత్తం మీద ఈ సినిమా ఓటీటీ ప్రకటన అయితే చాలా మంది అభిమానుల్లో మంచి జోష్ తెచ్చిపెట్టిందని చెప్పచ్చు.