Baby Movie fame Kirrak Seetha reveals her casting couch experience: చిన్న సినిమాగా విడుదలై సంచలనాన్ని క్రియేట్ చేసిన ‘బేబీ’ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ గురించి ఇప్పుడు సినిమా చూసిన వారు, చూడని వారు సైతం డిస్కషన్ పెట్టేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించిన కిరాక్ సీత కొద్దిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో తన ఆన్ స్క్రీన్ నెగిటివ్ క్యారెక్టర్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. ఈ మధ్య ఓ ఈవెంట్ కి వెళ్లి వస్తున్న సమయంలో కొంతమంది అబ్బాయిలు తనను ఫాలో అయ్యారని, తన ఫ్రెండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు, కానీ తాను అలా చేయలేదని చెప్పుకొచ్చింది. ఆ క్యారెక్టర్ చూసిన తరువాత తనని రేప్ చేస్తామంటూ, చంపేస్తాం అని బెదిరింపులు, చాలామంది తన అడ్రస్ తెలుసుకోవడానికి ప్రయత్నించారని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆమె తాజాగా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద కీలక వ్యాఖ్యలు చేసింది.
Aakanksha Singh: మైండ్ బ్లాకయ్యే ఫోజులతో రచ్చ చేస్తున్న నాగ్ హీరోయిన్.. ఇలా అయితే తట్టుకోవడం కష్టమే!
ఒక ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించమని అడిగితే నేరుగా అడిగిన వారు లేరు కానీ సోషల్ మీడియాలో, కాల్స్ లో అడిగిన వారు ఉన్నారని చెప్పుకొచ్చింది. వాళ్ళు దర్శకులో, నిర్మాతలో, లేక క్యాస్టింగ్ డైరెక్టర్లో కూడా తెలియదని తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అలా అడిగారని ఆమె పేర్కొంది. వాళ్ళు నేరుగా అడగరు కానీ ప్రొడ్యూసర్ మిమ్మల్ని ఫామ్ హౌసులో కలవాలని అనుకుంటున్నారు, మిమ్మల్ని ఫారెన్ తీసుకువెళ్ళాలి అనుకుంటునారు, మీకు ఈ ప్రాజెక్ట్ కి 25-30 లక్షలు ఇద్దామని అనుకుంటున్నారని చెప్పే వారని ఆమె అన్నారు. అయితే అలా కలుద్దాం అని చెప్పాక రెండు మూడు సార్లు దాటవేశానని వాళ్ళు రమ్మని బలవంతం చేయడంతో అక్కడికి రాలేనని ఏదైనా మూవీ ఆఫీసు ఉంటే చెప్పండి అక్కడికే వస్తానని అన్నానని కానీ వారు మళ్ళీ కాల్ చేయలేదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే నేరుగా అయితే తాను లైంగిక వేధింపులు ఏమీ ఎదుర్కోలేదని ఆమె చెప్పుకొచ్చింది.