క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ ‘దొరసాని’ సినిమాతో హీరో ఎంట్రీ ఇచ్చాడు. అతని రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చక్కని విజయాన్ని అందుకుంది. అలానే మూడో చిత్రం ‘పుష్కక విమానం’ ఇటీవలే విడుదలైంది. ఇదిలా ఉంటే… ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం పలు చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు. ‘గం గం గణేశా’, ‘హైవే’, ‘బేబీ’ చిత్రాలలో కథానాయకుడిగా చేస్తున్నాడు. ‘బేబీ’ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ‘బేబీ’ చిత్రీకరణ తుది దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారు. త్వరలో సినిమా విడుదలకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నారు