ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’.ఈ సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమాపై ముందు నుంచి ఎంతో నమ్మకంగా వున్నారు మేకర్స్. వారు ఊహించిన స్థాయి కంటే భారీ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి రాజేష్ అద్భుతంగా తెరకెక్కించారు. సాయి రాజేష్ గతంలో ‘కలర్ ఫోటో’వంటి నేషనల్ అవార్డు పొందిన సినిమాకు కథను అందించారు.సాయి రాజేష్ బేబీ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించాడు. నిజ జీవిత అంశాలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమాకి యూత్ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది .ఈ సినిమాకు దాదాపు 7 కోట్ల 40 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ చిత్రానికి కేవలం రెండు రోజుల్లోనే 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక నేడు ఆదివారం కావడం తో ఈ సినిమాకి మార్నింగ్ షోస్ నుండి ప్రతీ చోట కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి., ప్రస్తుతం ఈ సినిమా కు వున్న క్రేజ్ కి భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.
ఇకపోతే ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు సాయి రాజేష్ కి నిర్మాత SKN ఇచ్చిన పారితోషకం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి అయిన వెంటనే నిర్మాత SKN దర్శకుడు సాయి రాజేష్ కు రెండు కోట్ల రూపాయిల పారితోషకం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.అంతే కాదు లాభాలలో వాటాను కూడా ఇస్తానని మాట ఇచ్చాడని సమాచారం..ఈ సినిమా ఫుల్ రన్ లో కచ్చితంగా 20 కోట్ల రూపాయిల షేర్ ని రాబడుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు..అదే కనుక జరిగితే నిర్మాత SKN కి భారీగా లాభాలు వస్తాయి.ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య తన నటనతో సినిమా రేంజ్ ను పెంచేసింది. భవిష్యత్ లో ఈ భామకు వరుస అవకాశాలు వస్తాయని తెలుస్తుంది.