Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kabir Duhan Singh: అయోధ్యలో బాల రాముడి మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ఆధ్యాత్మిక నగరం ప్రపంచవ్యాప్తంగా సరికొత్త వెలుగులు సంతరించుకుంది. ఇప్పుడు ఈ పవిత్ర క్షేత్రం, రామమందిర ఘన చరిత్ర వెండితెరపైకి రావడానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. బాబా నీమ్ కరోలి కథ ఆధారంగా వచ్చిన ‘హనుమాన్ అంశ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభించిన అపూర్వ స్పందన నేపథ్యంలో, అయోధ్య రామమందిరం బ్యాక్‌డ్రాప్‌లో ఓ భారీ చిత్రం తెరకెక్కబోతున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. టాలీవుడ్లో ‘జిల్’ చిత్రంతో పాపులర్ అయిన ప్రముఖ విలన్ కబీర్ దుహన్ సింగ్ తాజాగా అయోధ్య పర్యటనలో ఈ విషయమై కీలకమైన హింట్ ఇచ్చారు. తాజాగా కబీర్ దుహన్ సింగ్ లక్నోలో జరిగిన ఓ కీలక సమావేశం పాల్గొని తర్వాత అయోధ్య వెళ్లారు. అక్కడ ప్రసిద్ధ హనుమాన్‌గఢి ఆలయంతో పాటు రామమందిరాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “లక్నోలో మా సమావేశం సక్సె్స్‌ఫుల్‌గా ముగిసింది. అంతా ఆ హనుమంతుడి ఆశీస్సులతోనే సాగుతోంది. త్వరలోనే మేము మళ్లీ ఇక్కడికి రాబోతున్నాం” అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కబీర్ దుహన్ సింగ్ చేసిన ఈ కామెంట్స్, లక్నోలో జరిగిన ప్రొడక్షన్ చర్చలను బట్టి చూస్తే.. అయోధ్య రామ మందిరం నేపథ్యంతో ఓ క్రేజీ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోందన్న వార్తలకు గట్టి బలం చేకూరిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, డైరెక్టర్, నటీనటుల గురించిన అధికారిక సమాచారం త్వరలోనే వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. ‘హనుమాన్ అంశ్’ సినిమా సాధించిన ఘన విజయంపై కబీర్ ప్రశంసలు కురిపించారు. ప్రజల్లో భక్తి, నమ్మకం, ఆధ్యాత్మిక అంశాలతో కూడిన కంటెంట్‌కు విపరీతమైన ఆదరణ దక్కుతోందని, ఇది సినీ పరిశ్రమకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చిందని పేర్కొన్నారు. కేవలం అయోధ్య రాముడే కాకుండా, భారతీయ సనాతన ధర్మం, ఇతిహాసాల ఆధారంగా మరిన్ని భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. త్వరలోనే పూరీ జగన్నాథుని మహిమలపై ఓ చిత్రం, ప్రేమానంద మహారాజ్ ఆలోచనల ఆధారంగా ‘రాధా అంశ్’ అలాగే రాధాకృష్ణుల దివ్య ప్రేమకథతో మరో సినిమా నిర్మాణ దశలోకి వెళ్లనున్నాయి. గోపీచంద్ హీరోగా వచ్చిన ‘జిల్’ సినిమాతో స్టైలిష్ విలన్‌గా తెలుగు తెరకు పరిచయమైన కబీర్ దుహన్ సింగ్.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘బెంగాల్ టైగర్’, ‘పైల్వాన్’, ‘శాకుంతలం’ వంటి పలు భారీ చిత్రాల్లో విలన్‌గా మెప్పించారు. ఇప్పుడు ఆయన అయోధ్య రామమందిర ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇచ్చిన లీక్, అటు సినీ వర్గాల్లోనూ ఇటు రామభక్తుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
తాజావార్తలు
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!