AAY: ‘ఆయ్’ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAY Movie: ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహించారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ ‘ఆయ్’ అని టైటిల్ పెడితే.. ఒక ప్రాంతానికే పరిమితం అవుతుందా? అని అనుకున్నాం. దాని కోసం ఇరవై రకాల వేరియేషన్స్‌లో అనుకున్నాం. కానీ ఫిదా టైటిల్ అన్ని చోట్ల వర్కౌట్ అయింది. కథ బాగుంటే అందరూ ఆదరిస్తారు. ఈ కథను ఒప్పుకున్న నితిన్ గారికి థాంక్స్. ‘కథ చాలా సరదాగా ఉంది. కథ హిట్ అయితే అదే హీరోయిజం’ అని నితిన్ అన్నారు.
Also Read: Allu Arjun: త్రివిక్రమ్ -బన్నీ సినిమా అలాంటిదే.. డబ్బుల వేటలో అల్లు అరవింద్, నాగవంశీ!
Also Read
దర్శకుడు అంజి కె.మణిపుత్ర మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు గోదావరి ప్రాంతాన్ని బేస్ చేసుకుని వచ్చిన చిత్రాలన్నింటిల్లోకెల్లా ది బెస్ట్ చిత్రం అవుతుంది. నితిన్ నార్నే ఎంతో సహజంగా నటించారు. అచ్చం అక్కడి యాసలానే మాట్లాడాడు. అంకిత్, కసిరాజు అద్భుతంగా నటించారు. అజయ్ గారు మంచి పాటలు ఇచ్చారు. బన్నీ వాస్ ఆల్ రౌండర్.ఆయన లేకపోతే ఈ చిత్రం లేదు. అమ్మాయిలను నేచర్‌తో పోల్చుతాం. అమ్మాయి తడిసినా, ఊరు తడిసినా అందంగా ఉంటుంది. మా ఆయ్ చిత్రం కూడా అంత అందంగా ఉంటుంది’ అని అన్నారు.. ఇక ఎన్నో హిట్ ఫిలిమ్స్ అందించిన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!