Avatar-2 : మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన అవతార్.. విజువల్స్ అయితే దేవుడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avatar-2 : ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సినీ ప్రేక్షకులను అలరించింది. ఇక దీనికి సీక్వెల్ ప్రకటించిన దగ్గరనుంచి అవతార్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా డిసెంబర్ 16 న రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయమని మేకర్స్ ను అభిమానులు అడుగుతున్నారు. ఇక అభిమానుల కోరిక మేరకు నేడు ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’పేరుతో వచ్చిన ఈ ట్రైలర్ ఒక విజువల్ వండర్ గా నిలిచింది.
అవతార్.. పాండారా గ్రహంలో జరిగిన కథ కాగా.. అవతార్ 2 ను సముద్ర గర్భంలో చూపించారు. అవతార్ లో జేక్ సల్లీ పాత్రలో సామ్ వర్డింగ్టన్ కనిపించాడు. ఇక అవతార్ 2 లో అతని కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశాడు కామెరూన్. ఇక సముద్రంలో వారు చేసిన విన్యాసాలు, ఎదుర్కున్న కష్టాలు.. ఒకరినొకరు ఆదుకోవడం ఇవన్నీ చూపించారు. ఈ చిత్రాన్ని లైట్ స్ట్రామ్ ఎంటర్టైన్మెంట్ మరియు టీఎస్జీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. భారత్‌లో ఈ చిత్రం ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!