Kalki2898AD: చంద్రబాబుకు సపోర్ట్ చేసి.. అశ్వినీదత్.. ప్రభాస్ ను రిస్క్ లో పెట్టాడా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki2898AD: ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్ సెన్సేషన్ సృష్టించిన విషయం తెల్సిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబును 14 రోజులు రిమాండ్ లో ఉంచమని కోర్టు తీర్పునిచ్చింది. ఇక ఈ తీర్పుకు కట్టుబడి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఇక చంద్రబాబు అరెస్ట్ ను టీడీపీ నేతలు, ఆయన అభిమానులు ఖండిస్తూ నిరసనలు చేస్తున్నారు. ఇంకోపక్క సినీప్రముఖులు సైతం చంద్రబాబుకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇక నేటి ఉదయం ప్రముఖ నిర్మాత అశ్వినీదత్.. చంద్రబాబుకు సపోర్ట్ గా నిలుస్తూ ఒక వీడియోను షేర్ చేశారు. ” బాబుని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని పేర్కొన్న ఆయన అదొక దురదృష్టకరమైన రోజని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశానికి ఒక గొప్ప ప్రైమ్ మినిస్టర్ ను, ఒక గొప్ప లోక్ సభ స్పీకర్ ను, ఒక గొప్ప రాష్ట్రపతిని ఇచ్చిన ది గ్రేట్ లెజెండ్ చంద్రబాబును ఇంత దుర్మార్గంగా అరెస్ట్ చేసి, లేనిపోని బీభత్సం చేసిన వారికి కచ్చితంగా పుట్టగతులు ఉండవు అని శాపనార్ధాలు పెట్టారు. దీనికి పరిష్కారం త్వరలోనే రాబోతోందని మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా 160 సీట్లను గెలుస్తుందని” చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Raghavendra Rao: అప్పుడు బాంబ్ బ్లాస్ట్.. ఇప్పుడు బ్లాక్ మార్క్.. చంద్రబాబుపై దర్శకేంద్రుడు ట్వీట్
Also Read
- B - Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
- IRUMUDI : ఇరుముడి ఓవర్సీస్ రివ్యూ.. రవితేజ మాస్ కంబ్యాక్ 'బ్లాక్ బస్టర్'
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
ఇక అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ ను రిస్క్ లో పడేశాయని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు.. కల్కి రిలీజ్ పై ప్రభావం చూపుతుందని అభిమానులు అంటున్నారు. ఇప్పటికే ఏపీలో టికెట్ రేట్స్ గురించి పెద్ద వివాదాలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఇప్పుడు చంద్రబాబుకు సపోర్ట్ గా నిలిస్తే .. సినిమా రిలీజ్ అప్పుడు టికెట్ రేట్స్ విషయంలో గొడవలు అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ కొద్దిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కల్కి రిలీజ్ అప్పుడు ఏపీలో ఈ మాటలు ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
తాజావార్తలు
-
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
-
B – Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
-
Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
-
BYD Sealion 7 Dynamic Launch: BYD సీలియన్ 7 డైనమిక్ విడుదల.. 71.8kWh బ్యాటరీ, 520KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!