Daren Sammy: మేము భారత్‌తో ఎంత గొప్పగా ఆడామో ఇప్పటికైనా తెలిసిందా.. విండీస్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో జరిగిన 3వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. వెల్లింగ్టన్లోని హ్యారీ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఊహించని రీతిలో విరుచుకుపడింది.
ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లో 113 పరుగులు చేసి సంచలన శతకంతో నాకౌట్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ 13.2 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి అద్భుత విజయం సాధించింది. అయితే భారత్ ఆడుతున్న ఈ అద్భుతమైన ఆట తీరును చూసి వెస్టిండీస్ మాజీ కెప్టెన్, విండీస్ కోచ్ డారెన్ సామి ఎక్స్ వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటీవల వెస్టిండీస్ జట్టు భారత్ పర్యటనకు వచ్చినప్పుడు టీమిండియాతో టీ20 సిరీస్‌ను డ్రా చేసుకోగలిగింది. భారత్‌ను వారి సొంత గడ్డపై నిలువరించడం ఎంత గొప్ప విజయమో ఇప్పుడు గుర్తు చేసుకుంటూ సామీ స్పందించారు.
Also Read
- National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
- Operation Sindoor: పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్‌కు కష్టకాలం.. సిందూర్‌పై కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..
- Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
తన ట్వీట్లో సామీ ఇలా పేర్కొన్నారు.. వావ్… భారత్‌లో మా జట్టు సాధించిన విజయాన్ని నేను ఎందుకు అంతగా ప్రశంసించానో ఇప్పుడు అర్థమవుతోంది. భారతదేశం చాలా ప్రమాదకరమైన జట్టు. నిజంగా వావ్! 1. చిన్న బౌండరీలు, 2. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లు, 3. బౌలర్లకు ఇబ్బంది కలిగించే తడి బంతి.. ఇన్ని సవాళ్లు ఉన్నా వారిని అడ్డుకోవడం విశేషమన్నాడు.
Wow…. That’s why I praised my team for what they accomplished in India. India is a dangerous team. #justwow
1. Smaller boundaries
2. Batting paradise pitches
3. Wet ball for bowlers— Daren Sammy (@darensammy88) October 27, 2026
ఇటీవల వెస్టిండీస్‌పై టీమిండియా టీ20 సిరీస్‌లో పోటీపడి డ్రా చేసుకున్న నేపథ్యంలో సామీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్ ఎలాంటి పిచ్‌పైనా, ఎంతటి భారీ లక్ష్యాన్నైనా సులువుగా ఛేదించగల ప్రమాదకరమైన జట్టు అని, అలాంటి బలమైన జట్టును విండీస్ నిలువరించడం తమ జట్టు సాధించిన గొప్ప విజయం అని ఆయన కొనియాడారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
-
National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
-
YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
-
Uppada Kothapalli : ఉప్పాడ కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా.. ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత
-
Bhogi Release: శర్వానంద్ ‘భోగి’ ఊచకోత అప్పుడే..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!