అనుష్క శెట్టి, కృతి శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి హీరోయిన్ ల తర్వాత కర్ణాటక నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘అషిక రంగనాథ్’. కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమాతో TFIలోకి ఎంట్రీ ఇచ్చిన అషిక రంగనాథ్, కన్నడలో శివన్న, కిచ్చా సుదీప్ లాంటి హీరోస్ పక్కన నటించింది. తెలుగులో డెబ్యూ మూవీ సాలిడ్ హిట్ అయ్యి అషిక తెలుగు కెరీర్ ని ఆశించిన స్థాయిలో ఫుల్ చేయలేకపోయింది. అమిగోస్ సినిమా సోసోగానే ఆడింది కానీ అషికకి మాత్రం యూత్ బాగానే కనెక్ట్ అయ్యారు. సినిమా హిట్ అయ్యి ఉంటే అషికకి తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చేవేమో. ‘ఎన్నో రాత్రులు’ సాంగ్ లో అషిక చేసిన డాన్స్ అండ్ గ్లామర్ షో థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. అమిగోస్ తర్వాత అషిక తెలుగులో ఇంకో సినిమాకి సైన్ చెయ్యలేదు కానీ ఈ కన్నడ బ్యూటీ ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ కి రీచ్ అవుతోంది.
లేటెస్ట్ గా సోషల్ మీడియాలో అషిక పోస్ట్ చేసిన ఫోటోస్ చూసిన ఫాన్స్, అమ్మాయిలు ఇంతా అందంగా ఉండకూడదు తెలుసా ఇట్స్ ఏ క్రైమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వైట్ టాప్, బ్లూ డెనిమ్ జీన్స్ లో అషిక రంగనాథ్ ఫోటోస్ ని షేర్ చేసింది. ఇందులో అషిక టైట్ క్లోజప్ లో కూడా చాలా క్యూట్ గా కనిపిస్తూనే… గ్లామర్ గా ఉంది. ఫోటోస్ లో బ్యూటీఫుల్ స్మైల్ ని క్యారీ చేస్తున్న అషిక, కుర్రాళ్లను తన ఫోటోలకి కట్టిపడేస్తుంది. ఇలా యాక్టింగ్, గ్లామర్, డాన్స్ లాంటి విషయాల్లో అషిక ఇప్పటికే ఆకట్టుకుంది కాబట్టి గ్లామర్ షోకి అడ్డేమి లేదు, క్యారెక్టర్ డిమాండ్ చేసినంత వరకూ స్కిన్ చేస్తాను అనే హింట్ మేకర్స్ కి ఇస్తే చాలు అషిక కెరీర్ కి మంచి బూస్టింగ్ వచ్చినట్లే.
— Ashika Ranganath (@AshikaRanganath) September 14, 2023