యంగ్ హీరో శ్రీవిష్ణు వరుసగా విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కమర్షియల్ చట్రంలో ఇరుక్కుపోకుండా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుని అదే పంథాలో సాగిపోతున్నారు. తాజాగా ఈ హీరో మరో సరికొత్త కథతో సినీ ప్రియులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. “అర్జున ఫల్గుణ” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న శ్రీవిష్ణు నెక్స్ట్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ లో శ్రీవిష్ణు ఒక ప్రత్యేక మిషన్‌లో డాషింగ్ మ్యాన్‌గా కనిపిస్తున్నాడు. శ్రీవిష్ణు స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. దర్శకుడు తేజ మార్ని అడవికి సంబంధించిన విజువల్స్‌ను ఆకట్టుకునే రీతిలో ప్రదర్శించారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న “అర్జున ఫల్గుణ” టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Read Also : “ఆర్ఆర్ఆర్” ఊర నాటు సాంగ్ ప్రోమో