కంటెంట్ రిచ్ మూవీస్ చేయడంలో పేరు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు తాజాగా మరో ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్ “అర్జున ఫాల్గుణ”తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిఫరెంట్ జోనర్ సినిమాలను రూపొందిస్తున్న మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా రిలీజ్ డేట్ లాక్ అయింది. 2021లోనే వినోదాన్ని అందించేందుకు అర్జునుడు సమరానికి సిద్ధం అయ్యాడు. ‘అర్జున ఫాల్గుణ’ చిత్రాన్ని డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
Read Also : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు “లైగర్”డబుల్ ట్రీట్
ఈ మేరకు శ్రీవిష్ణు, అమృత అయ్యర్, జబర్దస్త్ మహేష్, మరో ఇద్దరు గోనె సంచిలో ఏదో చూసి ఆశ్చర్యపోయినట్లు పోస్టర్ ద్వారా చూపిస్తూ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. మరోవైపు కీర్తి సురేష్ నటించిన “గుడ్ లక్ సఖి” కూడా డిసెంబర్ 31న రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాల జానర్లు వేరు. బాలకృష్ణ ‘అఖండ’ విజయం ఇండస్ట్రీలో కొత్త ఆశలు నింపింది. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేదు కాబట్టి మేకర్స్ ఇప్పటి నుంచే ‘అర్జున ఫాల్గుణ’ ప్రమోషన్స్ జోరు పెంచారు!