Aranmanai 3: సాధారణంగా ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో జోనర్ లో ఒక సిగ్నేచర్ ఉంటుంది. అలాగే తమిళ నటుడు, డైరెక్టర్ అయిన సుందర్ సి కి హర్రర్ సినిమాలను తీసి అభిమానులను భయపెట్టడంలో ఒక ఆనందం ఉంది అని చెప్పాలి. కేవలం ఆయన హర్రర్ సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించలేదు. కానీ, ఆయనకు ఒక గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాలు అంటే హర్రర్ సినిమాలే అని చెప్పాలి. ఇక సుందర్ సి.. నటి ఖుష్బూ భర్త అని కూడా అందరికి తెలుసు. ఇక సుందర్.. 2014 లో అరణ్మనై అనే ఒక హర్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో ఈ సినిమా చంద్రకళ అనే పేరుతో రిలీజ్ అయ్యింది. హన్సిక, ఆండ్రియా హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇక దీనికి సీక్వెల్ గా అరణ్మనై 2 అంటూ 2016 లో మరో సినిమాతో వచ్చాడు. అందులో త్రిష, హన్సిక, సిద్దార్థ్ నటించారు. ఈ సినిమా తెలుగులో కళావతి పేరుతో రిలీజ్ అయ్యి .. ఓ మోస్తరుగా ఆడింది.
Hanuman: పక్కకు తప్పుకోవడాలు లేవు.. వస్తున్నాం అంతే
ఇక 2021 లో అరణ్మనై 3 తీసుకొచ్చాడు. ఆర్య, రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా తెలుగులో అంతఃపురం అనే పేరుతో రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ ను అందుకుంది. ఈ మూడు భాగాల్లోనూ అందమైన హీరోయిన్స్ దెయ్యాలుగా మారడం.. చివరికి సుందర్ సి వచ్చి కాపాడడం జరుగుతూ ఉంటుంది. ఇక తాజాగా సుందర్ సి.. అరణ్మనై 4 ను ప్రకటించాడు ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటివరకు హాట్ హాట్ అందాలను ఆరబోసిన ఈ భామ.. ఇందులో దెయ్యంగా భయపెట్టనుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఒక పెద్ద బంగ్లా గేటు తీసుకొని ఇద్దరు చిన్నారులతో తమన్నా లోపలి వెళ్తున్నట్లు కనిపించింది. ఇక ఆ బంగ్లాలో దెయ్యం ఉన్నట్లు బ్యాక్ గ్రౌండ్ లో చూపించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమా తెలుగులో ఏ పేరుతో రిలీజ్ అవుతుందో.. ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.