టికెట్ ధరల అంశంపై సమయం కోరిన సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారంపై ఇంకా ఎటూ తేలలేదు. పేదలకు సహాయం చేయడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తమ పనిని సమర్థించుకుంటుంటే, పలువురు సినీ ప్రముఖులు మాత్రం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమ పట్ల, ఎగ్జిబిషన్ రంగం పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సినిమా పెద్దలు కోర్టుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా టికెట్ ధరల నియంత్రణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. సినిమా టికెట్ ధరల అంశంపై సమగ్రంగా పరిశీలన జరపాలంటూ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి సినీ పరిశ్రమ కమిటీ భేటీ త్వరలో జరగునుందని ప్రభుత్వం కోర్టుకి తెలిపింది. అంతేకాదు ఈ సమావేశం ఉన్న కారణంగా విచారణ వాయిదా వేయాలని కోర్టును కోరింది ప్రభుత్వం. దీంతో సినిమా టికెట్ రేట్ల విచారణను ఫిబ్రవరి10కి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇక అఫిడవిట్ దాఖలుకు అడ్వకేట్ జనరల్ సమయం కోరినట్టు సమాచారం.
Read Also : రౌడీ బాయ్స్ ‘బృందావనం’లో అనుపమ… మార్మోగుతున్న డిఎస్పీ మాస్ బీట్
Also Read
ఆంధ్రాలో సినిమా టికెట్ రేట్ల అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 27న ఓ కమిటీని నిర్ణయిస్తూ జీవో జారీ చేసింది. ఈ కమిటీలో మొత్తం 13 మంది సభ్యులు ఉండగా, హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్ గా వ్యవహరిస్తోంది. న్యాయశాఖ కార్యదర్శి, కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు పురపాలక శాఖ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు, సమాచార, పౌర సంబంధాల కమీషనర్, ఎగ్జిబిటర్ వేమూరి బాలరత్నం, డిస్ట్రిబ్యూటర్ తుమ్మల సీతారాంప్రసాద్, సినీ గోయర్స్ అసోసియేషన్ తరఫున సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సిబిఎఫ్సి (సెన్సార్ బోర్డ్) సభ్యుడు వడ్డి ఓంప్రకాశ్ నారాయణ, తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు ముత్యాల రాందాస్, డాక్టర్ జూపల్లి రాకేశ్ రెడ్డి, శ్రీమతి గంప లక్ష్మీ సభ్యులుగా నియమితులయ్యారు.
తాజావార్తలు
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
-
Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?