రౌడీ బాయ్స్ ‘బృందావనం’లో అనుపమ… మార్మోగుతున్న డిఎస్పీ మాస్ బీట్

ఆశిష్ రెడ్డి నటించిన తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’. కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుండి ‘బృందావనం’ అనే మూడవ సింగిల్ విడుదలైంది. కాలేజీ కల్చరల్ ఈవెంట్‌లో రద్దీగా ఉండే వేదికపై అనుపమ ఈ పాట కోసం డ్యాన్స్ చేసినట్టు లిరికల్ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. అనుపమ తన అందమైన స్టెప్పులతో అందరి దృష్టిని ఆకర్షించింది. సంగీతం విషయానికి వస్తే… దేవి శ్రీ ప్రసాద్ మరోసారి మాస్ పెప్పీ నంబర్‌ను విడుదల చేశాడు. ఈ సాంగ్ యూత్ లో ఖచ్చితంగా ఉత్సాహాన్ని మరింతగా పెంచుతుంది. గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం, మంగ్లీ మనోహరమైన వాయిస్ సాంగ్ లో హైలెట్.

Read Also : బాలయ్య సినిమాలో శాండల్ వుడ్ సెన్సేషన్… పవర్ ఫుల్ రోల్

‘రౌడీ బాయ్స్’ మేకర్స్ సినిమా జనవరి 14 లేదా 15న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం ప్రేక్షకులకు ముఖ్యంగా యువతకు పండుగలా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తుండగా, ఆదిత్య మ్యూజిక్‌తో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ‘రౌడీ బాయ్స్‌’లో ఆశిష్, అనుపమ మధ్య కెమిస్ట్రీ మరో హైలైట్‌గా ఉండబోతోంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కు మధి కెమెరా వర్క్, మధు ఎడిటింగ్ అందించారు.

Related Articles

Latest Articles