లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కొంచెం గ్యాప్ తర్వాత నటిస్తున్న మూవీ ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’. యంగ్ హీరో, ఫ్యూచర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ మూవీ నుంచి బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. లేటెస్ట్ గా ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆగస్టు 21న మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ బయటకి రానుంది. ఈ ట్రైలర్ బయటకి వస్తే సినిమాపై బజ్ క్రియేట్ అవుతుంది. నవీన్ పోలిశెట్టి బయట ఎక్కువగా కనిపిస్తూ ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు కానీ హైప్ క్రియేట్ అవ్వట్లేదు. స్వయంగా అనుష్క బయటకి వచ్చి ప్రమోషన్స్ చేస్తే కానీ మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి సినిమాకి హైప్ వచ్చేలా కనిపించట్లేదు.
నిజానికి టీజర్ తోనే బజ్ ని జనరేట్ చేసారు కానీ దాన్ని సస్టైన్ చెయ్యడంలోనే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీమ్ ఫెయిల్ అయ్యారు. బజ్ కి క్యారీ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చి ఉంటే ఈ పాటికి ఆడియన్స్ లో ఈ మూవీపై మంచి అంచనాలు ఉండేవి. హైప్ క్రియేట్ అవ్వకపోవడానికి ఇంకో కారణం, రిలీజ్ డేట్ వాయిదా పడడం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా అనౌన్స్ చేసిన డేట్ కి రిలీజ్ అవ్వకుండా వాయిదా పడుతూనే ఉంది. ఈ కారణంగానే ఆడియన్స్ లో ఈ మూవీపై ఇంట్రెస్ట్ తగ్గుతుంది. మేకర్స్ ఇప్పటికైనా ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన పాజిటివ్ బజ్ ని క్యారీ ఫార్వార్డ్ చేస్తూ అనుష్కని ప్రమోషన్స్ కోసం రంగంలోకి దించితే చాలు సెప్టెంబర్ 7న టాలీవుడ్ ఖాతాలో మరో హిట్ పడినట్లే.
You’ll love the trailer as well 🩷
— UV Creations (@UV_Creations) August 19, 2023