సోషల్ మీడియాలో దూరంగా ఉండే స్టార్స్ లో ముందు వరుసలో ఉంటుంది టాలీవుడ్ జేజమ్మ అనుష్క. చాలా అరుదుగా సోషల్ మీడియాలో కన్పిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా అనుష్క తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా తమ కుటుంబానికి సంబంధించిన అందమైన ఫోటోను షేర్ చేసింది. అనుష్క తల్లిదండ్రులు ఏఎన్ విట్టల్ శెట్టి, ప్రఫుల్లతో తాను కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ “హ్యాపీ యానివర్సరీ అమ్మ & నాన్న” అని రాసింది. దీంతో అనుష్క అభిమానులంతా ఇప్పుడు ఆమె పేరెంట్స్ కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Read Also : RRR: ఇంతకూ ఎన్టీయార్ కు హీరోయిన్ ఉన్నట్టా లేనట్టా!?
ఇక ఆమె సినిమాల విషయానికొస్తే… అనుష్క శెట్టి చివరిసారిగా “నిశ్శబ్ధం” చిత్రంలో కనిపించింది. ఇది 2020లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఇక ఆ తరువాత తన కొత్త చిత్రాన్ని దర్శకుడు మహేష్ బాబుతో ప్రకటించింది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. చాలా రోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి అప్డేట్ లేదు. రానున్న రోజుల్లో ఈ మూవీలో స్టార్ కాస్ట్, సాంకేతిక నిపుణుల గురించి అప్డేట్స్ వెలువడే అవకాశం ఉంది.