టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబోలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఘాటి’. గతంలో వీరిద్దరూ కలసి తెరకెక్కించిన ‘వేదం’ సినిమా తెలుగు సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు పొంది, పలు అవార్డులు కూడా అందుకున్న విషయం తెలిసిందే. అదే స్టైల్‌లో, ఘాటి సినిమా కూడా యాక్షన్, ఎంటర్టైన్మెంట్, వాస్తవానికి సినిమాటిక్ విజువల్ పై ప్రత్యేక ఫోకస్ కలిగిన ఒక భారీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది.
Also Read : Tamannaah : మగాళ్లపై తమన్నా సెన్సేషన్ స్టేట్‌మెంట్..
ఇలాంటి ప్రాజెక్ట్‌లో వర్క్ చేయడంలో అనుష్క కూడా ఎప్పుడు ముందుంటారు. అయితే తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా, రానా దగ్గుబాటితో ఫోన్ ద్వారా మాట్లాడుతూ, ఆమె అభిమానులకు స్పెషల్ హామీ ఇచ్చింది.. ‘నేను నిరంతరం పని చేయాలనుకుంటున్నాను. రాబోయే నెలల్లో, వచ్చే ఏడాదిలో వరుసగా సినిమాలు చూసే అవకాశం ఉంటుంది’ అని చెప్పింది అనుష్క. ఈ మూవీలో తన పాత్ర గురించి మాట్లాడుతూ..
‘వేదం సినిమాలో సరోజ పాత్ర లాగే, ఘాటి సినిమాలో శీలవతి పాత్ర కూడా నా కెరీర్‌లో ఐకానిక్ పాత్రగా నిలుస్తుంది. స్క్రిప్ట్‌ను చదివి, మూవీ పరంగా, యాక్షన్ సీన్లలో నా పాత్ర సంతృప్తికరంగా ఉంది. విక్రమ్ ప్రభు నటించిన దేశిరాజు పాత్ర కూడా ఈ సినిమాను హైలైట్ చేసింది’ అని తెలిపింది. అంటే మొత్తానికి ఈ సినిమా రిలీజ్ తర్వాత అనుష్క తన తదుపరి ప్రాజెక్ట్లలో కూడా ఫ్యాన్స్‌కు వరుస సినిమాలు అందించడానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. మరి సెప్టెంబర్ 5 నుండి ఈ మూవీ హైప్ అంచనాలను మించుతుందో లేదో చూడాలి.