సినీ ఇండస్ట్రీలో గ్లామర్ రోల్స్ నుంచి వైవిధ్యమైన పాత్రల వరకు తనదైన ముద్ర వేసుకున్న నటి తమన్నా భాటియా. ఇటీవల ఒక కార్యక్రమంలో ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. సాధారణంగా మహిళలు తమ శక్తిని తాము గుర్తించకపోవచ్చని, కానీ జీవితంలో ఉన్న అద్భుతమైన పురుషుడు దాన్ని ప్రతిబింబంగా చూపిస్తారని ఆమె భావన వ్యక్తం చేసింది.
Also Read : Ghati : మొత్తానికి ‘ఘాటి’ ప్రమోషన్ పై స్పందించిన అనుష్క.. వీడియో వైరల్
‘‘మహిళలు స్వయంగా చాలా శక్తివంతులు, తెలివైరవారు. కానీ కొన్నిసార్లు వారి ప్రతిభన్ని గుర్తు చేయడానికి జీవితంలో ఉన్న అద్భుతమైన పురుషులు సహాయం చేస్తారు’’ అని తమన్నా చెప్పిన మాటలు అందరినీ ఆలోచనలో పడేశాయి. తన జీవితంలో అలాంటి వ్యక్తులు ఉన్నారని ఆమె చెప్పిన తీరు, స్పష్టంగా నటుడు విజయ్ వర్మ గురించి అని అభిమానులు భావిస్తున్నారు. విజయ్ వర్మ తన జీవితంలోకి వచ్చాక తమన్నా నిజంగానే ఆత్మవిశ్వాసంతో, ఆనందంగా కనిపించింది. అయితే తర్వాత వారి కెరీర్ ప్రెజర్ కారణంగా విభేదాలు వచ్చి విడిపోయారనే వార్తలు వైరల్ అయ్యాయి.
కానీ ఈ జంట ఒకరిపై ఒకరు నెగెటివ్‌గా మాట్లాడకుండా, పరస్పర గౌరవంతో సంబంధాన్ని ముగించుకోవడం అందరినీ ఆకట్టుకుంది. తమన్నా వ్యాఖ్యల్లో అర్థం చేసుకునే స్వభావం ఇప్పుడు మహిళలకు ఒక ప్రేరణ గా మారుతోంది. సాధారణంగా బ్రేకప్‌ల తర్వాత, మీడియా ఎదుట ఏ జంట అయిన అగౌరవంగా మాట్లాడతారు.. కానీ తమన్నా తన భావాలను చెప్పిన తీరు మెచ్చుకోదగినయి. మొత్తానికి, ఈ వ్యాఖ్యలు తమన్నా వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా, ఆమె లోని మ్యాచ్యూరిటీ ని కూడా హైలైట్ చేశాయి.