టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి చాలా కాలం తర్వాత మళ్లీ పెద్ద తెరపై మెరుస్తున్నారు. ఈసారి అయితే తెలుగు కాదు, మలయాళం ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. ఆమె నటిస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ ‘కథనార్: ది వైల్డ్ సోర్సెరర్’ ఇప్పటికే సినీప్రియుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్లు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తుండగా, మలయాళ నటుడు జయసూర్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జయసూర్య లుక్ పోస్టర్ విడుదల కాగా, ఆయన పొడవాటి జుట్టు, దట్టమైన గడ్డంతో కనిపిస్తూ, ప్రాచీన కాలపు మాంత్రికుడి లుక్‌లో ఆకట్టుకున్నారు. పోస్టర్‌లో “మీ సమయాన్ని, మీ మనస్సును, మీ వాస్తవికతను దొంగిలించేవాడు” అనే ట్యాగ్‌లైన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇక తాజాగా మేకర్స్..
Also Read : Prithviraj Sukumaran : లోకల్ పుష్ప అవతారంలో పృథ్వీరాజ్.. ‘విలాయత్ బుద్ధ’పై భారీ క్రేజ్!
అనుష్క శెట్టి లుక్‌ను రిలీజ్ చేశారు. అందులో ఆమె అద్భుతంగా కనిపిస్తుంది. ఫ్యాన్స్ అయితే “ఇదే అనుష్క మ్యాజిక్!”, “క్వీన్ ఈజ్ బ్యాక్!” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కురిపిస్తున్నారు. ఆమె లుక్, మాంత్రిక నేపథ్యంలో ఉండే మిస్టీరియస్ అట్మాస్ఫియర్‌లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని గోకులం గోపాలన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 9వ శతాబ్దం నేపథ్యంగా సాగే ఈ కథలో మాంత్రిక శక్తులు, ఆధ్యాత్మిక అంశాలు, మరియు సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ప్రధానంగా ఉండనున్నాయి. విఎఫ్‌ఎక్స్ పరంగా కూడా సినిమాను గ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.