టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ మూవి గురించి చెప్పక్కర్లేదు. జూలై 17న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన ఈ కోర్టు డ్రామా మంచి రెస్పాండ్ అందుకుంది. ముఖ్యంగా అనుపమ తనలోకి కొత్త కోణాలు చూపించింది. ఇక ఈ సినిమా టైటిల్ పై చాలా వాదన జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన కొత్త సినిమా ‘పరదా’ ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఆమె, ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదంపై బహిరంగంగా స్పందించింది.
నటి మాట్లాడుతూ.. ‘ ‘జానకి’ అనే పేరును ప్రధాన పాత్రకు, అలాగే టైటిల్‌కి పెట్టడం వల్లే ఈ వివాదం చెలరేగింది అంటే మాత్రం నేను దాన్ని అంగీకరించను. ఎందుకంటే మన దేశంలో ఎన్నో దేవుళ్లు, దేవతలు ఉన్నారు. మనలో చాలా మందికి దేవుని పేర్లే ఉంటాయి. ఉదాహరణకు నా నాన్న పేరు ‘పరమేశ్వరన్’. శివుడిని సంహారమూర్తి అంటారు కదా.. మరి నా నాన్న అలా చేస్తారా? జానకి దేవి గురించి తప్పుగా చూపితే అభ్యంతరం వ్యక్తం చేయాలి. కానీ, దేవుని పేరుని పాత్రకో, సినిమాకో పెట్టడాన్ని వ్యతిరేకించడం సరైనది కాదు’ అని ఆమె వివరించారు. అలాగే..
స్క్రిప్ట్ మార్పులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అనుపమ ‘ఇది న్యాయం కోసం పోరాడే యువతి కథ. నేను నటించేందుకు అంగీకరించిన సమయంలో అంత వరకే నాకు తెలుసు. ఆ తర్వాత కథలో మార్పులు జరిగాయి. ‘సినిమా నాకు చూపించకపోతే నేను ప్రమోట్ చేయను’ అని స్పష్టం చేశా. ఎందుకంటే అందులో ఏముందో నాకు తెలియాలి కదా. చాలాసార్లు మేం ఒప్పుకున్న స్క్రిప్ట్ సినిమా పూర్తయ్యేలోగా మారిపోతుంది. అందుకే బయటివారు ‘ఎందుకు చెత్త సినిమాలు చేస్తారు’ అని కూడా చాలా మంది అడుగుతున్నారు’ అని తెలిపింది అనుపమ.