సూపర్‌స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ శివ కాంబోలో ‘అన్నాత్తే’ అనే యాక్షన్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెలుగులో “పెద్దన్న” ఆమె టైటిల్ తో విడుదల కానుంది. అటు కోలీవుడ్ ప్రేక్షకులే కాకుండా టాలీవుడ్ లో రజినీ ఫాలోవర్స్ కూడా సినిమా విడుదల గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘అన్నాత్తే’ 4 నవంబర్ 2021 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. వినాయక చవితి సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్ ఇటీవల దసరా కానుకగా టీజర్ తో సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా రన్ టైం ఎంతో తెలిసిపోయింది. సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ‘అన్నాత్తే’ రన్ టైం 2 గంటల 43 నిముషాలు. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 4న విడుదల కానున్న ఈ సినిమా ప్రీమియర్స్ నవంబర్ 3నే జరగనున్నాయి.
Read Also : ప్రభాస్ బర్త్ డే… అభిమానులకు ‘మిర్చి’ ట్రీట్
ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామాలో కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, ఖుష్బు, మీనా, జగపతి బాబు, సూరి, సతీష్, బాల (దర్శకుడు శివ సోదరుడు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. నయనతార కథానాయికగా నటించారు. ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. గతంలో రజనీకాంత్ సూపర్ హిట్లు ఎందిరన్, పెట్టా ఈ నిర్మాణ సంస్థలోనే తెరకెక్కాయి. డి ఇమ్మాన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు.