Anna Konidela: మంచి మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్ భార్య.. పుట్టినరోజు సందర్భంగా ఏం చేశారంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anna Konidela: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొనిదెల ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ ఫ్యాన్స్‌తో పాటు ప్రజలందరూ ఆమె చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆమె తన పుట్టిన రోజు సందర్భంగా ఏం చేశారో తెలుసా.. వన్యప్రాణుల సంరక్షణకు అర్థవంతమైన ముందడుగు వేశారు. విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూ పార్క్‌లో ఉన్న ఒక ఆసియా ఏనుగు, ఒక రాయల్ బెంగాల్ పులిని ఆమె తన పుట్టిన రోజు సందర్భంగా దత్తత తీసుకున్నారు.
ఈ రెండు జంతువుల ఏడాది సంరక్షణ, పోషకాహారం, వైద్య అవసరాల కోసం ఆమె రూ.6.30 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ నిధులు జంతువుల సంక్షేమం, సంరక్షణ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు జూ అధికారులు తెలిపారు. వన్యప్రాణుల పరిరక్షణపై అవగాహన పెంచే లక్ష్యంతో అన్నా కొనిదెల తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు, పలువురు యానిమల్ లవర్స్ ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. బర్త్ డే లాంటి ప్రత్యేక సందర్భాలను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో అనుసంధానం చేయడం ఆదర్శనీయమని అభిప్రాయపడుతున్నారు. ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఈ సందర్భంగా పర్యావరణ ప్రేమికులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Tollywood : ఓవైపు గాయలు.. మరోవైపు షూటింగ్స్ బ్రేక్.. ఏమైంది మన టాలీవుడ్‌కి
- Kartik Aaryan: అస్సాం వరద బాధితులకు కార్తీక్ ఆర్యన్ భారీ సాయం.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి విరాళం
- Jagapathi Babu: ఎవరూ నన్ను కొట్టలేదు.. అసలు నిజం చెప్పి ఊరట ఇచ్చిన జగ్గూభాయ్!
- Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
తాజావార్తలు
-
Anna Konidela: మంచి మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్ భార్య.. పుట్టినరోజు సందర్భంగా ఏం చేశారంటే!
-
Tollywood : ఓవైపు గాయలు.. మరోవైపు షూటింగ్స్ బ్రేక్.. ఏమైంది మన టాలీవుడ్‌కి
-
Hero Vida VX2 GO FB: 128 KM రేంజ్‌తో విడా VX2 GO FB కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు ఇవే
-
PM Modi: యూకే కొత్త ప్రధానికి మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే!
-
Kartik Aaryan: అస్సాం వరద బాధితులకు కార్తీక్ ఆర్యన్ భారీ సాయం.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి విరాళం
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!