Anjanamma Comments about Pawan Stunning Victory: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా జరగడమే కాదు ఫలితాలు కూడా అంతకు మించి ఆసక్తికరంగా వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 స్థానాలు ఉండగా 135 స్థానాలలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. 21 స్థానాలలో జనసేన, వైసీపీ 11 స్థానాలు బిజెపి 8 స్థానాలు దక్కించుకున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గెలుపొందడంతో పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మ మాట్లాడుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మా అబ్బాయి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పడ్డ కష్టానికి భగవంతుడు మంచి ఫలితాన్ని ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి నేను గాజు గ్లాస్ లోనే టీ తాగుతాను అంటూ పవన్ కళ్యాణ్ జనసేన గుర్తు గాజు గ్లాసుని ఆమెను గుర్తు చేసుకున్నారు.
Akira Nandan: చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్న అకిరా నందన్
ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో పవన్ గెలుపొందినందుకుగాను సంబరాలు జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. మెగా హీరోలతో పాటు కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలకు హాజరైనట్లుగా తెలుస్తోంది. మరొక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం హైదరాబాదు నుంచి హుటాహుటిన బయలుదేరి మంగళగిరి వెళ్లారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనంతరం చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అయ్యారు. ఇక వీరిద్దరి మధ్య ప్రభుత్వ ఏర్పాటు ఎన్డీఏ మీటింగ్ కి వెళ్లే విషయాల గురించి చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం లేదు.