Anjali to marry a producer soon : హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క హీరోయిన్ గా చేస్తూ మరోపక్క కీలక పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మధ్యనే తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గీతాంజలి సినిమాకు సీక్వెల్ మొదలుపెట్టి రిలీజ్ కి కూడా రెడీ చేసింది. ఆ మధ్య బిజినెస్ మ్యాన్ ను వివాహమాడి విదేశాల్లో సెటిల్ అయ్యిందంటూ వార్తలు రాగా అది నిజం కాదని కొట్టిపారేసింది. ఈ స్థితిలో నటి అంజలి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు మళ్ళీ ప్రచారం మొదలైంది. ఆమె త్వరలో ఓ తెలుగు సినిమా నిర్మాతను పెళ్లి చేసుకోనుందని అంటూ ప్రచారం సాగుతోంది.
Manjummel Boys: మలయాళ ఇండస్ట్రీ హిట్ ని ఒక్క ఓటీటీ కూడా కొనలేదు.. ఎందుకో తెలుసా?
నిజానికి గతంలో క్లారిటీ ఇచ్చినప్పుడే ఓ వ్యక్తితో ఉన్న రిలేషన్ షిప్ వల్ల కెరీర్ పై దృష్టి పెట్టలేకపోయానని, ఆ సంబంధం రాంగ్ రిలేషన్ షిప్ అని అంజలి తెలిపింది. తన కెరీర్‌కి అడ్డుగా ఉన్న రిలేషన్‌షిప్ కంటే కెరీర్‌కే ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిదని కూడా ఆమె అప్పట్లో పేర్కొంది. అయితే ఇప్పుడు విడాకులు తీసుకున్న ఓ తెలుగు నిర్మాతతో అంజలి గత ఏడాది కాలంగా డేటింగ్ చేస్తున్నట్టు, త్వరలో వారు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు పుట్టుకొచ్చాయి. తెలుగు మీడియా రాసిందని తమిళ మీడియా, తమిళ మీడియా రాసిందని తెలుగు మీడియాలో మొత్తంగా అంజలి పెళ్లి వార్తలు కనిపిస్తున్నాయి. ఒకసారి ఆమె గట్టిగానే ఈ విషయం మీద స్పందించింది. మరి ఈసారి కూడా అవి కేవలం పుకార్లే అంటుందో లేక నిజమే అంటుందో చూడాలి.