Animal: బాలీవుడ్ కు ధమ్ మసాలా బిర్యానీ రుచి చూపించన్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Animal: అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ ట్రెండ్ ను మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో టాలీవుడ్ చరిత్ర మారిపోయింది. ఇక విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి తరువాత అదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేశాడు సందీప్. షాహిద్ కపూర్ నటించిన ఈ సినిమా అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ రెండు సినిమాల తరువాత సందీప్ రెడ్డి వంగా నుంచి వస్తున్న చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా యానిమల్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రణబీర్ లుక్.. ఆ యాక్షన్.. రక్తపాతం మొత్తం అభిమానులను హై లెవెల్ కు తీసుకువెళ్ళింది.
Akkineni Naga Chaitanya: సమంతకు అది ఎక్కువ.. సంచలనం రేపుతున్న చై కామెంట్స్
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
ఇప్పటివరకు బాలీవుడ్ లో తెలుగు సినిమాల సత్తా.. డబ్బింగ్ రూపంలోనే చూపించారు. ఇక ఇప్పుడు అసలు సిసలు కథతో తెలుగోడి సత్తా చూపించడానికి సందీప్ రెడ్డి దిగాడు. మొన్నటికి మొన్న కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ .. జవాన్ సినిమా తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ఒక తమిళ్ డైరెక్టరే ఆ రేంజ్ లో చూపిస్తే.. అసలు ఒక తెలుగు డైరెక్టర్ తలుచుకుంటే ఏం చేయగలడో యానిమల్ తో సందీప్ చూపించనున్నాడు. బాలీవుడ్ నుంచి ఎంతోమంది డైరెక్టర్లు తెలుగు హీరోలతో సినిమాలు చేశారు. కానీ, అవేమి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు ఒక తెలుగు డైరెక్టర్.. బాలీవుడ్ హీరోను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో బాలీవుడ్ ఫ్యాన్స్ చూడబోతున్నారు. మొదటి నుంచి కూడా అభిమానులు బాలీవుడ్ కు ధమ్ మసాలా బిర్యానీ రుచి చూపించన్నా అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!