టాలీవుడ్ టాప్ దర్శకులలో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత మరెవరైనా ఉన్నారు అంటే అది అనిల్ రావిపూడి మాత్రమే. పటాస్ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. కళ్యాణ్ రామ్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత సాయి దుర్గ తేజ్ తో సుప్రీమ్ సినిమాను డైరెక్ట్ చేసి మరొక హిట్ ఇచ్చాడు. ఆ వెంటనే మాస్ మహారాజ రవితేజతో రాజా ది గ్రేట్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి.
Also Read : Shahid Kapoor : కబీర్ సింగ్ తర్వాత హిట్ చూడని షాహిద్.. రోమియోతో గట్టెక్కుతాడా?
ఇక మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, విక్టరీ వెంకటేష్ తో F2, F3తో వరుస ప్లాప్స్ లో ఉన్న వెంకీకి కంబ్యాక్ హిట్ ఇచ్చాడు. దాంతో సీనియర్ హీరోలను అనిల్ రావిపూడి బాగా చూపిస్తాడు అనే నిరూపించుకున్నాడు. ఇక ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమాను డైరెక్ట్ చేసాడు అనిల్. కెరీర్ లో మొదటి సారి తన కామెడీ ట్రాక్ ను పక్కన పెట్టి బానావో భేటికో షేర్ అనే కాన్సెప్ట్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా హిట్ తో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా అనిల్ బాగా డీల్ చేయగలడు అని నిరూపించుకున్నాడు. అలాగే ఈ సినిమాతో ఏకంగా జాతీయ బెస్ట్ ఫిల్మ్ గా భగవంత్ కేసరి సినిమాకు అవార్డు అందుకున్నాడు. ఇక లేటెస్ట్ గా చాలా కాలంగా హిట్ లేక సతమతమవుతున్న మెగాస్టార్ చిరుతో మనశంకరవరప్రసాద్ తో సాలిడ్ హిట్ ఇచ్చాడు. కెరీర్ లో ఇప్పటివరకు 9 సినిమాలు చేసిన అనిల్ రావిపూడి ‘ తన కెరీర్ లో బాగా ఇష్టమైన సినిమా అంటే బాలయ్యతో చేసిన ‘భగవంత్ కేసరి’ అని ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా రావడం చాలా హ్యాపీగా ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
