Anil Kapoor: బాలీవుడ్ టాక్ షో కాఫీ విత్ కరణ్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ తారల బెడ్ రూమ్ సీక్రెట్స్, వారి శృంగారపు అలవాట్ల ముచ్చట్లతో ఈ షో నిత్యం హాట్ హాట్ గానే ఉంటుంది. ఇప్పటికే వరుస ఎపిసోడ్స్ తో కాక రేపుతున్న ఈ షోలో తాజాగా సీనియర్ హీరో అనిల్ కపూర్ ఎంట్రీ ఇచ్చి సందడి చేశాడు. కుర్ర హీరో వరుణ్ ధావన్ తో అనిల్ కపూర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ హీరోలు ఇద్దరు కలిసి జుగ్ జూగో జియో సినిమా చేసిన విషయం విదితమే. ఇక ఈ షోలో అనిల్ ను కూడా వదలలేదు కరణ్. తనదైన రీతిలో ఫన్నీ ప్రశ్నలను సంధించాడు. ఇక వాటికి ఏ మాత్రం తడబడకుండా అనిల్ చెప్పిన సమాధానాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మీరు యంగ్ ఉండడానికి గల మూడు కారణాలు చెప్పండి అని అనిల్ ను కరణ్ ప్రశ్నించగా.. శృంగారం.. శృంగారం..శృంగారం అని టక్కున చెప్పేశాడు అనిల్. అయితే అందుకు కరణ్ ఓహో అనేలోపు ఇదంతా స్క్రిప్ట్ లో రాసిచ్చిందే అని చెప్పి షాక్ ఇచ్చాడు.
ఇక వరుణ్ ను కూడా ఇలాంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చచేశాడు కరణ్. ఈ ఎపిసోడ్ లో కుర్ర హీరో కన్నా అనిల్ ఎక్కువగా ఎంజాయ్ చేశాడంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఇప్పటివరకు ఎవరికి తెలియని ఒక విషయాన్ని అనిల్ బట్టబయలు చేశాడు. ఈ షోలో శృంగారంకు సంబంధించిన ఏ విషయమైన స్క్రిప్ట్ అని అనిల్ కపూర్ తేల్చిచెప్పేశాడు. అంటే ప్రేక్షకులను రాబట్టుకోవడానికి కరణ్ ఇలాంటి ప్రశ్నలు కావాలనే వారికి వేసి, కాంట్రావర్సీ అయ్యే సమాధానాలను కూడా అతనే ఇస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఇలా చేయడం ఎంత వరకు పద్దతి అని నెటిజన్లు మండిపడుతున్నారు.