ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మిస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సూపర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ నుండి రానున్న ఈ సినిమా హీరోగా రామ్ కెరీర్ లో 22వ సినిమా.
కాగా ఈ సినిమా టైటిల్ ను నేడు ఉస్తాద్ రామ్ పోతినేని బర్త్ డే కనుకగా టైటిల్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమాకు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేసారు. సాగర్ అనే క్యారక్టర్ లో కన్నడ స్టార్ ఉపేంద్ర ఫ్యాన్ గా రామ్ కనిపించబోతున్నాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన రామ్ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించగా ఇప్పుడు రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ కూడా అదిరింది. అలాగే తమిళ ద్వయం వివేక్ శివ, మెర్విన్ సోలొమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్ గా ఉంది. సున్నితమైన వినోదంతో పాటు మనసును హత్తుకునే కథాంశంతో యూత్, ఫ్యామిలీ, ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కుతున్న ఈ సినిమాతో రామ్ పోతినేని సాలిడ్ కంబ్యాక్ గ్యారెంటీ అనిపిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.