VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటీనటుల క్యారెక్టర్‌ను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై యాంకర్, నటి విష్ణుప్రియ భీమనేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిరంతరం తప్పుడు ప్రచారం చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతున్న ప్లే లైక్ ఇంకాగ్నిటో’ అనే యూట్యూబ్ ఛానల్‌పై ఆమె హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారని ఆమె అన్నారు.
విష్ణుప్రియ భీమనేని మాట్లాడుతూ “మియాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, ఎఫ్ఐఆర్ నమోదైంది. యాక్షన్ తీసుకోబోతున్నారు. వి ఆర్ సో గ్రేట్ఫుల్!. ‘ఇంకాగ్నిటో’ అనే YouTube ఛానల్ ఉంది. తను ఒక అమ్మాయి అయ్యుండి, వేరే ప్రతి సెలబ్రిటీ అమ్మాయిల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అందుకే నేను ఆమె మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అనుకున్నా, తనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇన్ఫర్మేషన్గా చెప్తున్నాను; మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ ఛానల్ మీద స్ట్రైక్ పడేటట్టు, మీ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేటట్టు చేస్తాం. ఎప్పుడో యాక్షన్ తీసుకోవాలి, కానీ చాలా రోజులు వెయిట్ చేసి, చాలా నిందల తర్వాత, చాలా నెగిటివ్ బ్యాడ్ పబ్లిసిటీ, రాంగ్ పబ్లిసిటీ, రాంగ్ ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లాగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆడియన్స్‌కి ప్రొజెక్ట్ చేస్తున్నందుకు, కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో అలా రాంగ్గా చేస్తున్న వాళ్ళ మీద ఈ కంప్లైంట్.
Also Read
మేము ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి వచ్చింది జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఆనందపరచడానికి. వాళ్ళు ఉన్న బాధల్లో ఒక ఫైవ్ మినిట్స్ గానీ, 10 మినిట్స్ గానీ మా కంటెంట్ చూసి వాళ్ళు ఎంజాయ్ చేయాలని. నిజంగా తప్పులైనప్పుడు నిందించండి, ఖండించండి; తలదించుకుని ఎన్నైనా మాటలు పడతాము. తప్పు కానివి క్యారెక్టర్ అస్సాసినేట్ చేస్తూ, “డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది” ఇలాంటి వర్డ్స్.. అది కూడా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద ఛానల్స్ లో! ఓకే ఫైన్. ఇంకా ఎన్ని రోజులు ఇలా నోరు మూసుకొని ఉంటాను? ఒక్కసారైనా నాకోసం నేను నించొని.. నాకోసమే కాదు, ఇంకా వేరే ఏ ఆడపిల్లల గురించి ఎలా పడితే అలా, ఎవరు పడితే ఎవరైనా మాట్లాడకూడదని ఈ డెసిషన్ తీసుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే ఒక్కరితో స్టార్ట్ చేశాము. ఇక ముందు ఎవరు ఇలా చేసినా మీ ఛానల్స్ మీద స్ట్రైక్స్ పడేలా, కఠిన చర్యలు తీసుకునేలా ముందుకు వెళ్తాం” అని విష్ణుప్రియ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
-
Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
-
ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
-
Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
ట్రెండింగ్
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..