Anasuya Sister: జబర్దస్త్‌లో అక్క అనసూయ స్థానాన్ని చెల్లెలు భర్తీ చేయబోతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anasuya Sister: టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ కామెడీ షో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్‌లు లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఇప్పుడు వాళ్లంతా సినిమా అవకాశాలతో మునిగి తేలుతున్నారు. అటు ఈ షోలో యాంకర్లు ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా అనసూయ, రష్మీ ఎందరో అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అనసూయ యాంకర్‌గా రానంతవరకు యాంకర్ అంటే ఎంతో పద్ధతిగా ఉండాలనే భావన అందరిలోనూ ఉండేది. అనసూయ ఎప్పుడైతే జబర్దస్త్ యాంకర్‌గా అడుగుపెట్టిందో అప్పటి నుంచి తన గ్లామర్‌తో ఆమె అందరిని ఆకట్టుకుంది. పొట్టి దుస్తులతో కుర్రాళ్ల మతులను పోగొట్టింది. కేవలం యాంకర్ల కోసమే కొందరు జబర్దస్త్ షోను చూసేవాళ్లంటే అతిశయోక్తి కాదు.
Read Also: Jacqueline Fernandez: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మధ్యంతర బెయిల్ పొడిగింపు
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ప్రస్తుతం అనసూయకు వెండితెర అవకాశాలు ఎక్కువగా వస్తుండటంతో ఇటీవల ఆమె జబర్దస్త్ షోకు గుడ్‌బై చెప్పింది. ఆమె స్థానంలో రష్మీ మాత్రమే యాంకర్‌గా వ్యవహరిస్తోంది. గతంలో గురువారం ఎపిసోడ్‌కు అనసూయ, శుక్రవారం ఎపిసోడ్‌కు రష్మీ యాంకర్లుగా కనిపించేవాళ్లు. కానీ ఇప్పుడు రెండు ఎపిసోడ్లలోనూ యాంకర్‌గా రష్మీ మాత్రమే వస్తోంది. దీంతో అనసూయ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే త్వరలో అనసూయ వెలితిని తీర్చేందుకు ఆమె సోదరి వస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అనసూయ పోలికలతోనే ఉండే ఆమె సోదరి వైష్ణవి యాంకర్‌గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి జీ తెలుగులో ఓ షోకు వైష్ణవి యాంకర్‌గా రానున్నట్లు తెలుస్తోంది. వైష్ణవి అక్కడ ఆకట్టుకుంటే త్వరలో జబర్దస్త్ షోకు కూడా ఆమెను తీసుకునే అవకాశాలు ఉన్నాయని అనసూయ అభిమానులు భావిస్తున్నారు. మరి అక్క అనసూయ తరహాలో వైష్ణవి ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!