Anasuya: కోలీవుడ్ నటుడు బాబీ సింహ, వేదిక ప్రధాన పాత్రల్లో యాటా సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రజాకార్. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో అనసూయ ఒక ప్రత్యేక సాంగ్ లో కనిపించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ఎంతటి సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1947లో దేశం మొత్తానికి స్వాతంత్ర్యం వచ్చినా.. హైదరాబాద్‌కు మాత్రం రాలేదన్న పాయింట్‌తో రజాకార్
సినిమాను తెరకెక్కించారు. హైదరాబాద్ సంస్థానంలో రజాకర్లు చేసిన దౌర్జన్యాలు, అరాచక చర్యలు..ప్రధానంగా హిందువులందరినీ ఇస్లాం మతంలోకి మార్పించి.. ముస్లిం రాజ్యంగా మార్చాలన్న లక్ష్యంతో రజాకర్లు చేసిన క్రూరచర్యలను తెరకెక్కించినట్టుగా టీజర్ లో చూపించడం.. అది కాస్తా వైరల్ గా మారడం.. పెద్ద సెన్సేషన్ సృష్టించడం కూడా జరిగింది. ఇక అవన్నీ లెక్కచేయకుండా మేకర్స్ మాత్రం ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్దపడుతున్నారు. అంతేకాకుండా ప్రమోషన్స్ లో భాగంగా అనసూయ నటించిన స్పెషల్ సాంగ్ భారతి.. భారతి ని రిలీజ్ చేశారు.
Mega 157: వైజయంతీ వార్నింగ్.. మెగాస్టార్ కేనా.. ?
ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో అనసూయ పొలిటికల్ ఎంట్రీ మీద కామెంట్స్ చేసింది. “రాజకీయాల్లోకి రావాలని అనిపించలేదా మీకు” అన్న ప్రశ్నకు.. ” లేదు.. రావాలని అనిపించలేదు. బయట ఉద్దరించొచ్చు.. ఎవరిని ఉద్దేశించి నేను ఈ మాట అనడం లేదు. ఈ సాంగ్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.. కానీ, మంచి చేయాలంటే రాజకీయాలోకే రావాల్సిన అవసరం లేదు. నేను చేయాల్సింది ఏదైనా నేను చేస్తున్నాను.. రాజకీయాల్లోకే రావాలని లేదు.. వాళ్ళు కూడా ప్రజలను చూసుకోవడమే కదా చేసేది. నారాయణ రెడ్డి గారు బీజేపీ లోకి ఆహ్వానిస్తే వెళ్తారా.. ? అన్న ప్రశ్నకు.. నాకు తెలియదు.. ఆ టాపిక్ మా మధ్య ఎప్పుడు రాలేదు.” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.