ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఎవరు ఎప్పుడు కలుస్తారు.. ఎవరు ఎప్పుడు విడిపోతున్నారు అనేది అస్సలు తెలియడం లేదు. ప్రేమ, పెళ్లి అని ఎన్నో కబుర్లు చెప్పిన జంటలు.. పెళ్లి తరువాత ఏడాది కూడా అవ్వకుండానే విడాకులు అంటున్నారు. ఇక మూడు, నాలుగేళ్లు డేటింగ్ లో ఉన్న తారలు ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుంటారు అనుకోలోపు బ్రేకప్ అని చెప్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా లైగర్ బ్యూటీ అనన్య పాండే తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పినట్లు బీ టౌన్ లో వార్తలు గుప్పుమంటున్నాయి.
అనన్య, స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ తో మూడేళ్లనుంచి లవ్ లో ఉన్న సంగతి తెల్సిందే. పబ్ లు, పార్టీలు అంటూ తిరిగిన ఈ జంట ఇంకొన్ని రోజుల్లో పెళ్లితో ఒక్కటవ్వనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇక దీనిని కన్ఫర్మ్ చేస్తూ ఇషాన్ తల్లి నీలిమా కూడా అనన్య మా ఇంటి పిల్ల అని అనడంతో త్వరలోనే ఈ జంట పెళ్లి భాజాలు మోగుతాయి అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే ఈ జంట నోరు విప్పాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం అనన్య తెలుగులో పూరి- విజయ్ కాంబోలో వస్తున్న లైగర్ చిత్రంలో నటిస్తోంది.