సీనియర్ నటీమణి, నిర్మాత, స్టూడియో అధినేత శ్రీమతి మీర్జాపురం కృష్ణవేణి ఈ రోజు ఉదయం తుదిస్వాస విడిచారు. కృష్ణవేణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారు. ఈ రోజు ఉదయమే తమ మాతృమూర్తి తుది స్వాస విడిచినట్లు శ్రీమతి అనురాధ తెలిపారు. నటిగా ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. కథానాయికగా నటిస్తున్న సమయంలోనే ఆమెకు మీర్జాపురం రాజా వారిని వివాహమాడారు. అనంతరం ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించారు కృష్ణవేణి. రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు కృష్ణవేణి
Also Read : Daaku Maharaaj : డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
కృషవేణి మృతి పట్ల నందమూరి కుటుంబ సభ్యులు సంతాపం తెలియజేసారు. నందమూరి తారక రామారావు కుమారుల్లో ఒకరైన నందమూరి రామకృష్ణ కృష్ణ వేణి మృతికి నివాళులు అర్పిస్తూ “నేడు మన చలన చిత్ర సీమకు మరచిపోలేని చీకటి రోజు. మన కుటుంబానికి దైవం నాన్న,
నందమూరి తారక రామారావు గారిని 1949లో ‘మన దేశం’ చిత్రంతో వెండితెరకు పరిచయం చేసిన మహాతల్లి, మన దేశం చిత్రం నిర్మాత శ్రీమతి కృష్ణవేణమ్మ గారు స్వర్గస్తులవడం మాకు తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. ఆమె సినీ రంగానికి చేసిన సేవలు, వెండితెరకు చిరస్మరణీయమైన ప్రతిభావంతుల్ని పరిచయం చేసిన గొప్పతనం ఎప్పటికీ మాకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆమె లేకపోయినా ఆమె ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉంటాయని ఆశిస్తున్నాము.మా కుటుంబం తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ పరమాత్మ ఆమె ఆత్మకు శాంతి కలగజేయాలని ప్రార్థిస్తున్నాము” అని అన్నారు.