‘Pushpa: The Rise’: మాస్కోలో జండా పాతిన ఐకాన్ స్టార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప: ది రైజ్’ను ఇటీవల మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన చిత్రాల కేటగిరిలో ‘పుష్ప’ తెలుగు వర్షన్ ను ఇంగ్లీష్, రష్యన్ సబ్ టైటిల్స్ లో ప్రదర్శించడం విశేషం. గత యేడాది డిసెంబర్ 17న విడుదలైన ‘పుష్ప’ చిత్రం మలయాళ, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో డబ్ అయ్యింది. హీరో, హీరోయిన్లు అల్లు అర్జున్, రశ్మికా మందణ్ణపై చిత్రీకరించిన ‘శ్రీవల్లి’ పాటతో పాటు సమంతపై పిక్చరైజ్ చేసిన ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా’ ఐటమ్ సాంగ్ కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది. దానికి తోడు ఇప్పుడీ మూవీ వేవ్స్ వివిధ దేశాలను తాకుతున్నాయి.
అతి త్వరలోనే రష్యన్ డబ్బింగ్ వర్షన్ ను కూడా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల కాగానే స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్… ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. అంతేకాదు. అంతర్జాతీయంగానూ అతనికిప్పుడు గుర్తింపు లభిస్తోంది. ఇటీవలే న్యూయార్క్ టైమ్ స్వ్కేర్ లో భారతదేశం తరఫున హాజరై యాన్యువల్ డే పెరెడ్ లో పాల్గొన్నాడు. ‘పుష్ప: ద రైజ్’తో వచ్చిన పేరు ప్రఖ్యాతులను మరింత పెంచుకునేలా ఐకాన్ స్టార్ దీనికి సీక్వెల్ చేయబోతున్నాడు. ఇటీవలే ‘పుష్ప: ది రూల్’ పూజా కార్యక్రమాలు జరిగాయి. రెగ్యులర్ షూటింగ్ సైతం అతి త్వరలోనే మొదలు కానుంది.
Also Read
- Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
- Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
- The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
తాజావార్తలు
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!